నిన్ను చంపేస్తా.. బాబర్ అజమ్ కు సానియా వార్నింగ్

0

పాకిస్తాన్ క్రికెట్ జట్టు వన్డే టీ20 కెప్టెన్ అయిన క్రీడాకారుడు బాబర్ అజమ్ ను తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హెచ్చరించాడు. పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ భార్య అయిన సానియా తాజాగా ‘బాబర్ నిన్ను చంపేస్తా’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. షోయాబ్ మాలిక్ తో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో బాబర్ అజమ్ మాట్లాడుతుండగా ఇలా సానియా మీర్జా హెచ్చరిక చేసింది. ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో షోయాబ్ మాలిక్ తో మాట్లాడుతున్న బాబర్ సమాధానాలు ఇస్తున్నాడు.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో క్రికెటర్స్ లో నీకు ఇష్టమైన వదిన ఎవరు అంటూ షోయాబ్ మాలిక్ ఇన్ స్టాలో బాబర్ ను అడిగాడు. దీనికి బాబర్.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భార్య సైదా ఖుస్బత్ అని చెప్పాడు.

అయితే సానియా తో స్నేహం ఉన్న బాబర్ సడన్ గా వేరే పేరు చెప్పే సరికి షోయబ్ షాక్ తిన్నాడు.ఈ లైవ్ చూస్తున్న సానియా.. ‘ఐ విల్ కిల్ యూ’ అని మెసేజ్ పెట్టారు. ఇక నుంచి నిన్ను ఇంట్లో కూర్చోనీయను అంటూ చిరు కోపాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
Please Read Disclaimer