సానియా చెల్లి.. అజార్ కొడుకు పెళ్లి ఎప్పుడో చెప్పేశారు

0

ఆనమ్ మీర్జా.. అసదుద్దీన్ అన్నంతనే వారిని గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. టెన్సిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలుగా.. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ అన్నంతనే ఇట్టే గుర్తు పట్టేయటమే కాదు.. వారికి సంబంధించి బోలెడన్ని వార్తలు ఇటీవల కాలంలో చక్కర్లుకొడుతున్నాయి. వారిద్దరి మధ్య లవ్ డీప్ గా నడుస్తోందని.. త్వరలో వారి పెళ్లి జరుగుతుందన్న మాట వినిపిస్తుంటుంది. కానీ..అధికారిక కన్ఫర్మెషన్ మాత్రం ఉండదు.

తాజాగా ఆ లోటు తీరింది. ఒక కార్యక్రమానికి హాజరైన రెండు కుటుంబాలకు చెందిన వారు.. త్వరలోనే తమ కుటుంబాలు పెళ్లి బంధంతో ఒకటికానున్న విషయాన్ని వెల్లడించారు. ఆనమ్ మీర్జాకు తాను ఎలా ప్రపోజ్ చేసిన విషయాన్ని మీడియాకుచెప్పేశాడు అసదుద్దీన్.

రెండు కుటుంబాల మధ్య 19 ఏళ్ల అనుబంధం ఉండటం.. వారిరువురు తరుచూ కలిసేవాళ్లు. తమ పరిచయం హాయ్ తో మొదలైందని.. కొన్నిరోజులు కంటిన్యూ అయ్యాక.. తానే సాహసం చేసి ఐ లవ్యూ అని చెప్పాననని.. ఆనమ్ వెంటనే ఓకే చెప్పేసినట్లు చెప్పారు. తాను చాలా క్వైట్ గా ఉంటానని.. తాను మాత్రం హైపర్ అని చెప్పుకొచ్చాడు.

తమ పెళ్లి డిసెంబరులోనే జరుగుతుందని.. హైదరాబాద్ లోనే ఉంటుందని చెప్పిన అసద్..డేట్ ఇంకా ఫైనల్ కాలేదన్నాడు. ఆనమ్ మీర్జాకు మూడేళ్ల క్రితం (2016లో) అక్బర్ రషీద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్లు కలిసి ఉన్న వీరు 2018లో విడిపోయారు. ఆ నేపథ్యంలోనే ఆనమ్ మీర్జా.. అసదుద్దీన్ లు మంచి మిత్రులయ్యారు. కొన్నాళ్ల నుంచి వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందన్న వార్తలు వస్తున్నా.. అధికారికంగా కన్ఫర్మేషన్ మాత్రం తాజాగా వచ్చిందని చెప్పాలి.
Please Read Disclaimer