సానియా కొడుకు ఫోటో బయటకొచ్చింది

0

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెటర్ షోయబ్ ను పెళ్లాడిన సానియా ఈ మధ్యనే బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సోనియా తల్లి అయిన స్వీట్ న్యూస్ ను షోయబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తమ కుమారుడికి ఇజాన్ మిర్జా మాలిక్ పేరును పెట్టినట్లుగా వెల్లడించారు. సానియా.. షోయబ్ ఇంటి పేర్లు కలిసి వచ్చేలా బాబుకు పేరు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో బిడ్డతో పాటు నడుస్తున్న సానియా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో ఆసుపత్రిలో తీసినట్లుగా చెబుతున్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే క్రమంలో బాబును ఎత్తుకొని సానియా వెళ్లే వేళలో ఎవరో ఫోటో తీసి ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఫోటోలో బాబు చుట్టూ టవల్ కవర్ చేయటం వల్ల బాబు ముఖం కనిపించని పరిస్థితి.
Please Read Disclaimer