సానియా సోదరి పెళ్లి ఫిక్స్

0

బ్యాడ్మింటన్ సెన్సేషన్ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ సోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇటీవలే వారసుడిని గిఫ్ట్ గా ఇచ్చారు. సానియా కిడ్ ఇజాన్ మీర్జా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు సానియా ఇంట మరో శుభవార్త వినిపిస్తోంది. సానియా సోదరి ఆనమ్ మీర్జా త్వరలో పెళ్లాడబోతోంది. ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసద్ ని ఆనమ్ వివాహం చేసుకోబోతోంది. అయితే అసద్ తో ఆనమ్ ప్రేమ వ్యవహారంపై చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నా.. దానిని ఆ ఇద్దరూ ఎప్పుడు కన్ఫామ్ చేయలేదు. ఆ జంట షికార్లకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఎట్టకేలకు స్ట్రెయిట్ గా తన సోదరి పెళ్లి ఫిక్సయ్యిందని సానియా మీర్జా అధికారికంగా ప్రకటించారు. ఈ జంట పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని సానియా వెల్లడించారు. దిల్లీలో టెన్నిస్ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరైన సానియా.. అక్కడ ఈ వ్యాఖ్యలు చేయడంతో అభిమానులకు స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే అసద్- ఆనం జంట ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాల్లో కనిపిస్తున్న ఫోటోలు పరిశీలిస్తే.. ఈ జంటకు నిఖా పక్కా గా ఖాయమైందని అర్థమవుతోంది.

ఈలోగానే ప్యారిస్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లో బ్యాచిలరొట్టే పార్టీని సెలబ్రేట్ చేసి తిరిగి హైదరాబాద్ కి వచ్చామమని సానియా వెల్లడించడంతో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఆనమ్ కి ఇదివరకే వివాహం అయ్యిందని తెలుస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం అసద్ ని వివాహమాడుతోందిట. అలాగే అసద్ కంటే ఆనమ్ మూడేళ్లు పెద్ద.