సినిమా జీవితానికి గుడ్ బై చెప్పబోతున్న హీరోయిన్..!

0

సినిమా హీరోయిన్లు పెళ్లి విషయంలో ఆచితూచి అడుగేస్తుంటారు. అందాల దీపం వెలిగినంతకాలం వేగంగా ఇల్లు చక్కబెట్టుకొని అవకాశాలు తగ్గిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ.. శాండల్ వుడ్ బ్యూటీ మాత్రం త్వరగా పెళ్లి పీటలు ఎక్కాలని చూస్తోందట. ఈ మేరకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.

ప్రభాస్ ‘బుజ్జిగాడు’తోపాటు పలు తెలుగు సినిమాల్లో నటించి.. టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజనా గల్రాని. అయితే.. ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా రాణించలేకపోయింది. కన్నడ నాట మాత్రం అవకాశాలు బాగానే ఉన్న సమయంలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు

త్వరగా పెళ్లిచేసుకొని సినిమా జీవితానికి గుడ్ బై చెప్పాలని చూస్తోందట. అందుతున్న సమాచారం ప్రకారం.. డాక్టర్ పాషా అనే వ్యక్తిని సంజనా వివాహమాడబోతున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్ మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయిందని ఈ వేసవిలో ఒక్కటవ్వడం ఖాయమని శాండల్ వుడ్ మీడియాలో రాస్తోంది.

పెళ్లికి చాలా తక్కువ మందిని ఆహ్వానించబోతున్నారని వీరిలో బంధువులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఉంటారని సమాచారం. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు సంజనా. ఔనని కానీ లేదని కానీ చెప్పలేదు. దీంతో.. మౌనం అంగీకారమే అంటున్నారు చాలా మంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.