ఆ వీరుడి నీడ పడినా మరణమే

0

బాలీవుడ్ దర్శక దిగ్గజం అశుతోష్ గోవారికర్ చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. చారిత్రక కథలను సినిమాలుగా తీయడంలో ఆయనకు ఆయనే సాటి. సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్లు పోటీగా ఉన్నా! అశుతోష్ ప్రత్యేకతే వేరు. జోదా అక్భర్ మొహంజోదారో లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించకపోయినా క్రిటిక్స్ మెచ్చిన చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాల్లో భారీ తనం కాస్ట్యూమ్స్.. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ నిజంగా ఓ వండర్. చరిత్రను కళ్లకు కట్టినట్లే అనిపిస్తుంది. వందల కోట్లు ఖర్చు పెట్టి భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ రెండు సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. అయినా అశుతోష్ ఆ జానర్ ని వదల్లేదు. పోయిన చోటనే రాబట్టలనే కసితో ముందుకెళ్తున్నారు.

అందుకే మరోసారి అలాంటి కథాంశాన్నే ఎంచుకున్నారు. వెండి తెరపై మూడవ పానిపట్ యుద్ధాన్ని విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మూడవ పానిపట్ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని ‘పానిపట్ట’ టైటిల్ తో ఓ చిత్రాన్ని భారీ కాన్సాపై తెరకెక్కిస్తు న్నారు. ఇందులో అర్జున్ కపూర్- సంజయ్ దత్- కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా యూనిట్ సంజయ్ దత్- కృతి సనన్ కి చెందిన కొత్త పోస్టర్లను రిలీజ్ చేసారు. పోస్టర్లు రెండు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

సంజయ్ దత్ లుక్ అయితే అసాధారణం. గుబురు గడ్డం..శరీరమంతా రక్షణ కవచం తో భీకరమైన వీర యోధుడిని తలపిస్తున్నాడు. ఇందులో దత్ దురానీ సామాజ్య స్థాపకుడు అహ్మద్ షా అదాలి పాత్ర పోషిస్తున్నట్లు రివీల్ చేసారు. ఈ సందర్భంగా సంజయ్ తన పాత్రను ఉద్దేశిస్తు పోస్ట్ పెట్టారు. ‘అతని నీడ ఎక్కడ పడితే అక్కడ మరణమే’ అని తన పాత్రలో టింజ్ గురించి రివీల్ చేసారు. ఇక కృతి సనన్ సదా శివరావు బాహు రెండవ భార్య పార్వతి భాయ్ పాత్రలో కనిపించనుంది. నిజమైన రాణులకు కిరీటం అవసరం లేదని కృతి తన పాత్ర ను రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ కు ఇంకా కొన్ని గంటలే సమయం ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ సహా టాలీవుడ్ సౌత్ లోనూ ఆసక్తి నెలకొంది.
Please Read Disclaimer