కేజీఎఫ్ 2: అధీరా అంత భీకరుడా?

0

`కేజీఎఫ్- చాప్టర్ 1` సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ సినిమా `కేజీఎఫ్ 2` పై అంచనాలు స్కైని టచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్- హోంబలే ఫిలింస్ బృందం పార్ట్ 2 చిత్రీకరణ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా కథాంశం సహా కాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీకి రాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో కోలార్ బంగారు గనుల మాఫియాని పార్ట్ 1తో పోలిస్తే రెండో భాగంలో మరింత భీకరంగా చూపించాలన్నది ప్లాన్. అందుకోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని సంప్రదించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దత్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారమైంది. కానీ దానిని కేజీఎఫ్ 2 టీమ్ అధికారికంగా మాత్రం చెప్పలేదు. నిన్నగాక మొన్న అధీరా లుక్ రిలీజ్ చేస్తున్నాం. సర్ ప్రైజ్ ఉంటుంది! అంటూ కేజీఎప్ టీమ్ ప్రకటించింది.

అయితే ఆ సర్ ప్రైజ్ ఏదో ఇప్పటికే రివీల్ చేశాం. ఈ చిత్రంలో సంజయ్ దత్ లుక్ ని ఆయన బర్త్ డే సందర్భంగా 29 జూలై రోజున రివీల్ చేయబోతున్నారన్నది తెలిసిందే. ఆ ప్రకారమే నేడు సంజూ భాయ్ లుక్ ని కేజీఎఫ్ టీమ్ రివీల్ చేసింది. ఈ లుక్ ఊహించినట్టే ఫెంటాస్టిక్. పార్ట్ 1 ని మించి సీక్వెల్ అదిరిపోవడం ఖాయం అని అర్థమవుతోంది. సంజూ భాయ్ రగ్గ్ డ్ లుక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. గుబురు గడ్డం.. తీక్షణమైన చూపులు.. ఆ పొడవాటి జులపాల జుత్తుకు ముసుగు వేసి భాయ్ ఈ ఫోటోతోనే భయపెట్టేస్తున్నాడంటే ఇక తెరపై విలనీని ఏ రేంజులో పండించబోతున్నాడో అంచనా వేయొచ్చు. కేజీఎఫ్ -1లో పిలక ముడి విలన్లకు ఏమాత్రం తీసిపోని భీకర రూపంతో సంజయ్ దత్ అలరించబోతున్నారని అర్థమవుతోంది. ఇదివరకూ హృతిక్ – కరణ్ జోహార్ కాంబో మూవీ అగ్నిపథ్ లో సంజూ భాయ్ భీకర విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ 2లో మరోసారి విజృంభించబోతున్నాడని అర్థమవుతోంది. వాస్తవానికి కేజీఎఫ్ పార్ట్ 1లోనే సంజయ్ దత్ నటించాల్సింది. కానీ అప్పుడు కొత్త ముఖాలు చూసి సంజయ్ దత్ వదులుకున్నారు. కానీ కేజీఎఫ్ సక్సెస్ తర్వాత సీక్వెల్ కి అంగీకరించడం విశేషం.
Please Read Disclaimer