సంజూను ఇలా చూడలేక పోతున్నారు

0

సంజయ్ దత్ అనగానే బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఒక రూపం కళ్లకు కనిపిస్తుంది. అందులో చాలా సీరియస్ గా గంభీర్యంగా సంజయ్ దత్ కనిపిస్తూ ఉంటాడు. సంజయ్ దత్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన్ను చాలా మంది అభిమానిస్తూనే ఉన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా సంజయ్ దత్ సినిమాలకు విపరీతమైన ఆధరణ లభించింది. ఆయన వరకుసగా సినిమాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడ్డట్లుగా వెళ్లడయ్యింది. ప్రస్తుతం ఆయన స్టేజ్ 4 లో ఉన్నాడు.

ముంబయిలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లారు. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోలను ఆయన భార్య మాన్యత సోషల్ మీడియాలో షేర్ చేసింది. బక్క చిక్కిన సంజయ్ దత్ లో మునుపటి గాంభీర్యం కనిపించలేదు. దానికి తోడు ఆయన చాలా నీరసంగా చాలా డీ గ్లామర్ గా కనిపించాడు. అభిమానులు ఆయన్ను అలా చూడలేక పోతున్నాం అంటూ కన్నీరు పెట్టుకుంటున్న ఈమోజీలను కామెంట్స్ గా షేర్ చేస్తున్నారు. ఒక వైపు క్యాన్సర్ కు చికిత్స పొందుతూనే మరో వైపు సినిమాల్లో నటించేందుకు తనవంతు ప్రయత్నాలను సంజయ్ దత్ చేస్తున్నాడు.