సుశాంత్ మృతి పై స్పందించిన శివసేన నాయకుడు

0

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి పట్ల దేశం మొత్తం స్పందిస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు.. సినీ సెలబ్రిటీలు.. న్యాయవాదులు స్పందించగా.. తాజాగా మహారాష్ట్ర శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీనేత మాజీ కేంద్ర మంత్రి సంజయ్ రౌత్ స్పందించి ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్యకి కారణం డిప్రెషన్ మాత్రమేనా..? ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా.. అంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించిన ప్రశ్నలు ప్రస్తుతం చర్చలకు దారితీస్తున్నాయి. ఇక కొందరైతే ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. సుశాంత్ సూసైడ్ విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. సుశాంత్ మరణాన్ని మీడియా ఓ పండుగలా చేసుకుందని ఎద్దేవా చేశారు. విషాదాన్ని పక్కన పెట్టి మీడియా తమ స్వప్రయోజనాల కోసం పాకులాడిందని.. అలాగే కొందరు తమకు జరిగిన అన్యాయాల పై మౌనం వీడటం సరికాదని ఆయన తెలిపారు.

ఇక ఓ ఇంటర్వ్యూలో ఓ నిర్మాత మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకొంటారని నాకు ముందే తెలుసు? అని అన్నాడట. అయితే సుశాంత్ సూసైడ్ చేసుకొంటాడని తెలిసినా.. కాపాడటానికి ఎందుకు రాలేదని సంజయ్ రౌత్ ఆగ్రహించారు. అలాగే సుశాంత్ కేసు విచారణ ఎప్పటికి తేలుతుందో ఎవరికి తెలియదన్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాక చాలామంది మీడియా ముందు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే నిజాలు బయటకు రావని.. అసలు పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారనే విషయాలు బయటికి రావాలని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇక సంజయ్ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.. సుశాంత్ డిప్రెషన్.. మానసిక స్థితి.. అందుకే ఉరి వేసుకున్నాడు. నేపాటిజమ్.. బాలీవుడ్ మాఫియా ఈ పని చేసిందని అనడం సరికాదని అన్నారు. అయితే సంజయ్ మాటలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చలకు తావిస్తున్నాయి.
Please Read Disclaimer