బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న యంగ్ డైరెక్టర్…!

0

దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘ఘాజీ’ సినిమాతో దేశవ్యాప్తంగా గురింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ అండర్ వాటర్ వార్ బేస్డ్ మూవీ బాలీవుడ్ లో ‘ది ఘాజీ అటాక్’ పేరుతో విడుదలైంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ – అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో ‘అంతరిక్షం 9000 KMPH’ అనే సినిమా రూపొందించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ లిమిటెడ్ బడ్జెట్ తో హై క్వాలిటీ సినిమాలు తీయగల దర్శకుడిగా సంకల్ప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న సంకల్ప్ రెడ్డి పాపులర్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వర్షన్ లో ఒక స్టోరీకి డైరెక్టర్ గా వ్యవహరించారు. కాగా సంకల్ప్ రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడట. బాలీవుడ్ హీరో విద్యుత్ జమాల్ తో ఓ సినిమా రూపొందించబోతున్నాడని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ‘శక్తి’ ‘ఊసరవెల్లి’.. సూర్య ‘సికిందర్’.. విజయ్ ‘తుపాకీ’ సినిమాల్లో నటించిన విద్యుత్ జమాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కాగా ఇప్పటికే సంకల్ప్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ విద్యుత్ కి నచ్చి ఓకే చేశాడని సమాచారం. ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కనుందట. ఇక విద్యుత్ జమాల్ యుద్ధ విమానం నడిపే పైలట్ గా కనిపించనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న సంకల్ప్ ఈ చిత్రాన్ని జమ్ము కాశ్మీర్ ముంబై ఢిల్లీలోని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయాలని అనుకుంటున్నాడట. ‘ఘాజీ’ సినిమా సముద్రంలోకి తీసుకెళ్లిన సంకల్ప్.. ‘అంతరిక్షం 9000’ సినిమాతో స్పేస్ లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు మరోసారి ఆకాశంలో తన టాలెంటుని చూపించబోతున్నాడన్నమాట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Please Read Disclaimer