సంక్రాంతి సినిమాలు హిట్ అయితే వారికి లాభం!

0

వ్యాపారం లో చాలా ముఖ్యమైన అంశం మనీ రొటేషన్. మనీ రొటేషన్ ఆగితే ఎక్కడలేని తిప్పలు వచ్చి పడతాయి. అందుకే అనుభవం ఉండేవారు రొటేషన్ ఎప్పుడూ ఉండేలా చూసుకుంటారు. సినిమా ఇండస్ట్రీ.. బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా దీనికి అతీతం కాదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొన్ని హిట్ అవుతూ డబ్బు కనుక చేతులు మారుతూ ఉంటేనే కొత్త సినిమాలకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. అలా కాకుండా పోస్టర్లలో లాభాలు.. గల్లా పెట్టె నిండా చెల్లని చెక్కులు ఉంటే రొటేషన్ ఆగిపోతుంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలపై భారీగా బెట్టింగ్ సాగుతోందని తెలిసిందే. వీటి పై తర్వాత రాబోయే సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సంక్రాంతి సినిమాల్లో మహేష్.. అల్లు అర్జున్ సినిమాలు రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. ఈ రెండే కాకుండా ‘దర్బార్’.. ‘ఎంత మంచి వాడవురా’ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలపై బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు భారీగా పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాలు కనుక విజయం సాధించి వారికి లాభాలు తీసుకొస్తే ఆ తర్వాత రాబోయే సినిమాల పై ఉత్సాహం గా పెట్టుబడి పెడతారు. అలా కాకుండా బయ్యర్ల కు నష్టాలు మిగిలిస్తే మాత్రం తర్వాత రెండు నెలల పాటు విడుదలయ్యే సినిమాల బిజినెస్ పూర్తిగా చల్లబడుతుందని అంటున్నారు.

మాస్ మహారాజా ‘డిస్కో రాజా’ లాంటి సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. సంక్రాంతి సినిమాలు కనుక బయ్యర్లకు మంచి లాభాలు తీసుకొస్తే ఈ సినిమాలకు సూపర్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. లేకపోతే మాత్రం ఈ సినిమాలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ లెక్కన సంక్రాంతి సీజన్ సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని.. మంచి లాభాలు తీసుకురావాలని నెక్స్ట్ రిలీజ్ కానున్న సినిమాల మేకర్లు గట్టిగా కోరుకోవాలి.
Please Read Disclaimer