నేను అక్షయ్ పై ఆ ఉద్దేశంతో కామెంట్స్ చేయలేదు : సీనియర్ హీరోయిన్

0

సీనియర్ హీరోయిన్ శాంతి ప్రియ ఇటీవల ఓ ప్రముఖ డైలీకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ”నేను ఎప్పుడు స్కిన్ కలర్ మేజోళ్లు ధరించేదాన్ని. ఒకసారి షూటింగ్ లో అక్షయ్ నా మోకాళ్ల దగ్గర నల్లగా కనిపించడంతో నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అని చమత్కారంగా అడిగాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే అవి సరదాగా చేసిన వ్యాఖ్యలని నాకు తెలుసు. కానీ అప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. అక్కడే గట్టిగా ఏడ్చాను” అని వెల్లడించారు. అంతేకాకుండా ”నేను బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక నా రంగే నాకు శత్రువైంది. ఇక్కడ నేను చాలా వివక్షను ఎదుర్కొన్నాను. నా ఆత్మవిశ్వాసం దెబ్బతిని బాగా ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం తర్వాత నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చివరికి నా సినీ కెరీర్ ముగిసింది” అని చెప్పుకొచ్చారు.అయితే శాంతి ప్రియ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన శరీర రంగుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శాంతి ప్రియ స్పందిస్తూ ట్విటర్ వేదికగా ఆ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ”నేను ఈ విషయంపై క్లారిటీ ఇవ్వదలచుకుంటున్నాను. అక్షయ్ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడు నాతో సరదాగా ఉంటాడు. ఈ క్రమంలోనే నాపై అలా సరదాగా కామెంట్ చేశాడు. అంతే తప్పా నన్ను బాధించాలని చేసిన కామెంట్స్ కాదు. కానీ ఎదుటి వ్యక్తి రంగుపై సరదాగా వేసిన జోక్స్ కూడా వారిని అసౌకర్యానికి గురిచేస్తుందన్న విషయాన్ని మాత్రమే చెప్పాలనుకున్నాను తప్పా అక్షయ్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. నేను ఎప్పుడు ఆయన భవిష్యత్ లో మరింత ముందుకు వెళ్లాలని కోరే వ్యక్తిని” అని ట్వీట్ చేశారు శాంతిప్రియ.

కాగా శాంతిప్రియ సీనియర్ నటి భానుప్రియకి చెల్లెలు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక అక్కినేని నాగార్జున సరసన ‘అగ్ని’ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సౌగంధ్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్షయ్ తో కలిసి ‘ఇక్కే పే ఇక్కా’ అనే మరో సినిమాలో కూడా శాంతిప్రియ హీరోయిన్ గా నటించారు. చివరగా ‘హామిల్టన్ ప్యాలస్’ అనే హిందీ సినిమాలో నటించిన శాంతిప్రియ పలు టీవీ సిరీస్ లలో కూడా కనిపించింది.