సినిమాలే కాదు ఫోటోషూట్లతో కూడా వేడిపుట్టిస్తా!

0

సప్నా పబ్బి. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా తన కెరీర్లో వేగం పెంచుతుంది. చూడటానికి టాప్ హీరోయిన్ల తో పోటీపడే ఫిగర్ ఉన్నప్పటికీ అమ్మడికి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. నిజానికి సప్నా బ్రిటిష్ మోడల్ హిందీ లో సీరియల్స్ తో తెరమీద కన్పించింది. హిందీ సీరియల్ ’24’లో కిరణ్ రాథోడ్ గా నటించి అభిమానుల లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అమెరికాలోని ఆస్టన్ యూనివర్సిటీ నుండి పట్టా పొందిన పబ్బి అనేక యాడ్ ఫిలిమ్స్ లో నటించింది.

ఆ తర్వాత 2015లో వచ్చిన ‘ఖామోషియాన్’ సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. తొలి సినిమాతో పెద్దగా గుర్తింపు అవకాశాలు రాకపోవడంతో మళ్లీ సీరియల్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2018లో విడుదలైన తొలిప్రేమ సినిమాలో సునైనాగా ఒక సాంగ్ లో మురిపించింది. అదే సంవత్సరం ‘మర్ గయే ఓయ్ లోకో’ సినిమాతో పంజాబీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం ‘సత్ర కో షాదీ హై’ అనే సినిమాలో నటిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవలే ఇంస్టాగ్రాంలో లైట్ బ్లూ డ్రెస్ లో మెరుస్తున్న తన ఫోటోను పోస్టు చేసింది. మరి ఈ విషయం తెలిసిన కుర్రకారు ఊరుకుంటారా.. పబ్బిని అలా క్యూట్ స్మైల్ తో హాట్ పోజులో చూసేసరికి మనసు పారేసుకుంటున్నారు. హీరోయిన్లు సినిమాలలో ఎంత బిజీ ఉన్నా అభిమానులలో ఫోటో షూట్లతో వేడి పుట్టిస్తూనే ఉంటారు. పబ్బి కూడా అదే బాటలో అభిమానులు మంత్ర ముగ్ధులయ్యేలా ముఖారవిందంతో చెక్కిన శిల్పంలాంటి సొగసరి ఒంపులతో ఊపు ఊపుతోంది. పబ్బిని చూసిన ఎవ్వరైనా మతి పోగొట్టుకోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-