హలో అన్న సారా-ఇబ్రహీమ్

0

సీనియర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. నటించిన సినిమాలు రెండే అయినా రెండూ హిట్ కావడంతో సారాకు బాలేవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. ఈ జెనరేషన్ స్టార్ కిడ్ కావడంతో ఫోటోషూట్లు.. కవర్ పేజిలపై కనిపించడం అనేది చాలా కామన్. రీసెంట్ గా మరో సారి ‘హలో’ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది.. అయితే ఈ ఫోటో షూట్ స్పెషాలిటీ ఏంటంటే సారా తన ముద్దుల తమ్ముడు ఇబ్రహీమ్ అలీ ఖాన్ తో ఫోటో షూట్ లో పాల్గొనడం.

సైఫ్ మొదటి భార్య అమృతా సింగ్ కు ఇద్దరు సంతానం. సారా.. ఇబ్రహీమ్. అయితే ఇప్పటివరకూ ఇబ్రహీమ్ ఫిలిం మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటో షూట్ చేయలేదు. ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం అక్క సారాతో కలిసి ఫోటో షూట్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సైఫ్ తనయుడిపై పడింది. సారా తన అమ్మగారు అమృతా సింగ్ ను గుర్తు తెస్తుంటుంది అయితే ఇబ్రహీమ్ అచ్చుగుద్దినట్టుగా నాన్న సైఫ్ ను పోలి ఉన్నాడు. ఓ బాలీవుడ్ హీరోకు కావల్సిన లుక్స్..పర్సనాలిటీ ఉన్నాయి. సారా.. ఇబ్రహీమ్ ఇద్దరూ ప్రముఖ డిజైనర్లు అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులను ధరించి చాలా గ్రేస్ ఫుల్ గా పోజులిచ్చారు. హెలో మ్యాగజైన్ అక్టోబర్ ఎడిషన్ కోసం ఈ ఫోటో షూట్ లో పాల్గోనగా సారా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు “యో బ్రో..” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలకు భారీ స్పందన దక్కింది. గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా “జీన్స్ అలాంటివి” అంటూ కామెంట్ చేసింది. వీరిద్దరూ సైఫ్.. అమృతాల పిల్లలు మాత్రమే కాదు. టైగర్ అలీ ఖాన్ పటౌడీ-షర్మిలా టాగోర్ లకు మూడోతరం వారసులు. మరి ప్రియాంక అలా కామెంట్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇక సాధారణ నెటిజన్లు కూడా “సైఫ్ – అమృతాల జెరాక్సులు”.. “యో యో బ్రో-సిస్”.. “సైఫ్ అలీ ఖాన్- II’ అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer