ప్రేమపక్షుల బ్రేకప్ క్యాన్సిల్ అయిందా?

0

అదేంటో కానీ సినిమా ఇండస్ట్రీలో కథలు లేవని తెగ బాధపడుతూ ఉంటారు. కొందరేమో పిచ్చికథలు వందలకొద్ది రాసుకుని ఫిలిం మేకర్లు వినడం లేదు మొర్రో అని బాధపడుతూ ఉంటారు. కానీ కథలు కావాలంటే ఎక్కడికీ పోవాల్సిన పని లేదు. బాలీవుడ్ సెలబ్రిటీల లవ్ స్టొరీలు ఫాలో అయితే చాలు. అన్నిరకాల కథలు.. అన్ని వేరియేషన్స్ అక్కడే ఉన్నాయి. నమ్మరు కానీ ఎప్పుడు ఎవరికీ ఎవరికీ లంకె కుదురుతుంది..ఎప్పడు ఆ లింక్ కాస్తా తెగిపోతుందో.. మళ్ళీ ఎప్పుడు ఆ బ్రేకప్ జంట లవ్ అంటారో ఆ పైవాడికి కూడా తెలీదు.

ఈమధ్య న్యూ జెనరేషన్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ లవ్ ఎఫైర్ విషయంలో అలానే జరిగిందని బాలీవుడ్ మీడియాలో చెవులు పూర్తిగా ఊడి ఒళ్ళో పడేలా కొరుక్కుంటున్నారు. సారా .. యువ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘ఆజ్ కల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో ఇద్దరికీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావడంతో లవ్ లో పడ్డారట. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. సోషల్ మీడియాలో లవ్ సింబల్స్ పెట్టి మరీ ‘నా ప్రిన్సెస్’ అని మెసేజులు ఇస్తూ కార్తీక్ ఆర్యన్.. దానికి రెస్పాన్స్ ఇస్తూ సారా.. ఇలా ఇద్దరూ లవర్స్ అనే హింట్స్ ఇచ్చారు.

అయితే కొద్దిరోజుల క్రితం ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయట. పైగా ఇద్దరూ ఇతర ప్రాజెక్టులలో బిజీ కావడంతో బ్రేకప్ చెప్పుకొని ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. ఇంతటితో స్టొరీ అయిపోతే అది బాలీవుడ్ ఎందుకుఅవుతుంది.. మనం ఎందుకు అవి చెప్పుకుంటాం? రీసెంట్ గా ఇద్దరూ మళ్ళీ స్నేహపూర్వకంగా మెలుగుతున్నారట. సారా ఈమధ్య శ్రీలంక ట్రిప్ నుంచి తిరిగిరాగానే కార్తీక్ సారా ను కలిశాడట.. ఇద్దరూ బోలెడన్నికబుర్లు చెప్పుకుంటూ అచ్చికబుచ్చికలాడుకున్నారట. దీనర్థం.. ఆ తీవ్రమైన బ్రేకప్ తుస్సయినట్టే కదా? దీంతో బాలీవుడ్ మీడియాలో కలకలం రేగింది.

అయితే కొందరు అనుమానపు పక్షులు ఉంటారు కదా.. వారి లాజిక్ ఏంటంటే “బ్రేకప్ జెన్యూన్. అయితే ఆజ్ కల్ సినిమా ప్రమోషన్స్ లో ఎలాగూ కలిసి కనిపించాలి. అప్పుడు ఇలా తూర్పు పడమరలా ఉంటే సినిమాకు నష్టం జరుగుతుందని.. అప్పటివరకూ ఫ్రెండ్స్ లా నటించాలని దర్శక నిర్మాతలు కోరితే.. ఆ విధంగా ముందుకుపోతున్నారు”.. ఇక ఊ లేదు.. ఆ లేదు.. అది బాలీవుడ్ అంటే!
Please Read Disclaimer