ఫిట్నెస్ సూత్రాలను తెలియజేస్తున్న సారా అలీఖాన్

0

ఇప్పుడు సెలబ్రెటీలు అంతా ఫిట్ నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ఎక్సర్ సైజులను చేస్తూ తమ శరీరాన్ని అందంగా ఉంచుకుంటున్నారు. వాళ్లు అప్పుడప్పుడూ పోస్ట్ చేసే ఫొటోలు – వీడియోలు చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ భామ సారా అలీఖాన్ పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ‘సింబా’ – ‘కేధారినాధ్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ నట వారసురలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సారా రెండు సినిమాల్లోనే నటించినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే. తన నటన – అందం – అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అందరు సెలెబ్రిటీలు స్వీయ నిర్బంధం చేసుకున్న విషయం చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో సారా అలీఖాన్ మాత్రం సెల్ఫ్ మోటివేషన్ కోసం వర్క్ ఔట్ చేయడమే మార్గమంటు ఒక వీడియో పోస్ట్ చేసింది. కరోనా గురించి ఆందోళన చెందుతున్న ఈ సమయంలో దాని నుండి బయటకి రావడానికి వర్క్ ఔట్స్ చేస్తే చాలని – దీని కోసం జనాలతో కలిసి జిమ్ కి వెళ్ళవలసిన అవసరం లేదని ఇంట్లోనే చిన్న చిన్న ఆసనాలు వేస్తూ బాడీ ఫిట్ గా ఉంచుకోవచ్చని సూచించింది. మనం ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి వైరస్ మన దరిచేరదని చెప్పుకొచ్చింది. నా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ఎక్సర్ సైజులను ట్రైచేసి డిఫ్రెషన్ నుండి బయటపడండి అంటూ పిలుపునిచ్చింది. ఇది తెలిసిన అభిమానులు సారా అలీఖాన్ చేస్తున్న మోటివేషన్ ప్రోగ్రామ్ ని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-