సారా మళ్ళీ గ్లామర్ పోజిచ్చిందోచ్

0

స్టార్ కిడ్స్ కష్టపడరు.. వారికి అవకాశాలు ఊరికే వచ్చేస్తాయి.. గుర్తింపు కూడా కష్టపడకుండానే వస్తుంది అని ఊరికే ఆడిపోసుకునే వారికి సారా అలీ ఖాన్ ను చూపిస్తూ విమర్శకుల నెత్తి మీద గట్టిగా మొట్టాలి. ఎందుకంటే పైకి కనిపించినంత సులువుగా ఎవరికీ గుర్తింపు రాదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకమునుపు సారా కొబ్బరిబొండాం లాగా ఉండేదట. కానీ ఎప్పుడైతే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందో అప్పుడు తన బరువుపై ఫోకస్ చేసి.. ఒక ఏడాదిన్నర పాటు కష్టపడి కఠినమైన కసరత్తులు చేసి.. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా బాలీవుడ్ మిఠాయిలాగా మారిపోయింది.

లక్కీగా సారా నటించిన మొదటి రెండు సినిమాలు ‘కేదార్ నాథ్’.. ‘సింబా’ లు హిట్ కావడంతో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారింది. అలా అని ఊరికే ఇంట్లో కూర్చుకుండా సోషల్ మీడియాలో మంటలు రేపుతూ.. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్లు ఎంత కష్టపడుతూ అందాల ప్రదర్శనలు చేస్తారో అంతకంటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ తన సత్తా చాటుతోంది. నిన్నే ఒక హాట్ ఫోటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన సారా 24 గంటలు గడవక మునుపే మరో ఫోటోను పోస్ట్ చేసింది. బాజార్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసినదే ఈ ఫోటో కూడా. ఈ ఫోటోకు సారా ఇచ్చిన క్యాప్షన్ “కంటికి అందంగా కనిపించడం కాదు. ఆత్మకు అందంగా కనిపించాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మీరు ఆ క్యాప్షన్ గురించి మరీ ఎక్కువగా అలోచించి బుర్ర పాడు చేసుకోకండి. ఆత్మ-జీవాత్మ-పరమాత్మ.. ఆనందం-సదానందం- చిదానందం-బ్రహ్మనందం.. ఇవన్నీ చాలా సంక్లిష్టమైన అంశాలు. వాటిని వెంటనే వదిలేసి తూర్పు తిరిగి దణ్ణం పెడితే శ్రేష్ఠం!

బ్యాక్ టు హాట్ ఫోటో. బ్లూ – వైట్ కలర్ లో ఉన్న టాప్.. లైట్ గ్రీన్ కలర్లో పఫ్ లాగా ఉన్న లెహెంగా ధరించి ఒక సోఫా పై కూర్చుంది. కూర్చున్న పోజు కిరాక్ గా ఉంది. ఒక చేతికి వాచ్ పెట్టుకుంది.. రెండు బ్యాంగిల్స్ కూడా పెట్టుకుంది. మెడలో చెయిన్ లాంటిదేమీ లేదు. చెవులకు మాత్రం అందమైన రింగులు పెట్టుకుంది. ఎవరు మేకప్ చేశారో కానీ సూపర్. ఆ లిప్ స్టిక్.. ఐ మేకప్ అదిరింది. ఫోటో అంతా అందాలే అందాలు. సారా మేని రంగు.. కాళ్లు.. చేతులు.. ఫేస్ లో ఉన్న గ్లో.. హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్.

ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. కామెంట్లు లెక్కలేనన్ని. “ప్రెట్టినెస్ కేరాఫ్ సారా”.. “లాలీ పాప్ లాగా ఉన్నావు”..”మాషా అల్లా.. నషా చడ్ గయి”.. “అవసరానికంటే ఎక్కువ అందంగా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer