పింక్ లో మత్తు చల్లకే బుల్లి

0

ఫ్యాషన్ రోజువారీ జీవితంలో అత్యావశ్యకంగా మారింది. ఇది వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసే విద్యగా లోకానికి కనిపిస్తోంది. రెండేళ్లుగా బాలీవుడ్ లో చాలా మంది కొత్తతరం నటీనటులు ప్రవేశించారు. ఇలా వచ్చిన వాళ్లలో నటవారసురాళ్లు ఉన్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలు సారా అలీఖాన్ సైతం ఫ్యాషనిస్టాగా వెలిగిపోతోంది. ఇటీవల సోదరుడితో కలిసి మాల్దీవుల విహారాన్ని ఆస్వాధించిన సారా బికినీ ట్రీట్ గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే.. తాజాగా మరో కొత్త లుక్ తో కనిపించింది.

సారా తాజాగా ఓ కార్యక్రమానికి అటెండవుతూ పింక్ లుక్ లో ప్రత్యక్షమైంది. పటౌడీ యువరాణి సారా.. టాప్ డిజైనర్ మనీష్ అరోరా డిజైనర్ దుస్తులు ధరించింది. పుదీనా గ్రీన్ క్రాప్ టాప్ లుక్ సింపుల్ గా అదిరిపోయిందంతే. ఆ పింక్ బబుల్ గమ్ ప్లేటెడ్ షార్ట్ స్కర్ట్ తో ..ప్రింటెడ్ వైట్ జాకెట్ లో పూల డిజైన్ ప్రింట్లతో ఆకట్టుకుంది. ఈ లుక్ లో చాలా సరదాగా స్మైలిస్తూ కనిపిస్తోంది.

కేదార్ నాథ్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సారా సింబా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న `లవ్ ఆజ్ కల్ 2` లో నటిస్తోంది. కూలీ నంబర్ 1 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. 2020లో సారా డైరీ ఫుల్ గానే ఉంది మరి.
Please Read Disclaimer