సారా తాగకుండానే కిక్కు!

0

సంక్రాంతి సీజన్ దగ్గరపడుతోంది. పండగల వేళ ఆంధ్రా పల్లెల్లో ఊరూ వాడా ఒక ఐటెమ్ కి విపరీతమైన గిరాకీ ఉంటుంది. పట్నం నుంచి ఊళ్లోకి దిగే అల్లుళ్లు.. చుట్టాలు పక్కాలు అందరికీ నచ్చే ఐటెమ్ ఇది. అదేమిటి? అంటే.. నేచురల్ వంటకం అయిన సారా. కొందరు విప్పసారా అని పిలుస్తుంటారు. ఈ ఐటెమ్ ఒకప్పుడు ఆరోగ్యం కోసం ఉపయోగించేవారు. విపరీతంగా శ్రమించి కాయ కష్టం చేసి వచ్చిన రైతు కూలీలు ఒళ్లు నొప్పులు తగ్గడానికి దీనిని సేవించేవారు. అయితే కాలక్రమంలో తాగి రోడ్లపై పడేంత దుస్థితి ధైన్యం ప్రతి పల్లెటూళ్లోనూ నెలకొంది. సారా ఇప్పుడు కల్తీ సారాగా మారి రోగాల్ని తెస్తోంది.

అసలు ఆ సారా మాటేమో కానీ అంతకుమించిన కిక్కు కావాలంటే ఇదిగో ఇక్కడ ఈ పోటో చూడాల్సిందే. యాథృచ్ఛికంగానే సారా అని పేరు పెట్టుకున్నా కానీ ఈ పటౌడీ వారసురాలి నవ్వు చూస్తే సారా తాగినంత కిక్కు ఎక్కాల్సిందే. నషాలానికి నిషా ఎక్కించే అందం తన సొంతం. ఎంత డీసెంట్ గా నవ్వేస్తుందో అంతగా గుండెల్ని కొల్లగొట్టేయడం ఈ అమ్మడికే చెల్లింది సారా అలీఖాన్ కి. ముంబైలోని ఓ భారీ భవంతి టాప్ ఫ్లోర్ నుంచి వీధుల్లోకి చూస్తూ సారా ఇచ్చిన ఈ ఫోజులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. పింక్ డ్రెస్ లో సారా అందం పదింతలైంది.

మరీ ఇండీసెంట్ గా విమర్శించారు అని మీరు అనుకోకపోతే సారా గురించి మరో మాట చెప్పాలి. అసలు ఈ అమ్మడు బాలీవుడ్ ని వదిలి రాదు కానీ.. మన ప్రభాస్ సరసన కానీ.. చరణ్ .. ఎన్టీఆర్.. మహేష్ లాంటి స్టార్ల సరసన కానీ నటిస్తే ఎలా ఉంటుందంటారు? ఆడియెన్ కి విప్ప సారా మత్తు కూడా వదిలిపోవడం గ్యారెంటీ. కావాలంటే మీ మీద ఒట్టు!!
Please Read Disclaimer