విమర్శలు తీసుకోకుంటే ఎలా అమ్మడు?

0

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ హీరోయిన్ గా వరుస చిత్రాలతో దూసుకు పోతుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈమె ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంలో ఈ అమ్మడు చిన్న చిన్న తప్పటడుగులు వేస్తున్నట్లుగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇటీవల నటించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రంలోని ఆమె నటనకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.

సూపర్ హిట్ మూవీ లవ్ ఆజ్ కల్ కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. అప్పట్లో సైఫ్ అలీ ఖాన్ ఇంకా దీపిక పదుకునేలు జంటగా నటించారు. ఇప్పుడు సీక్వెల్ లో కార్తిక్ ఆర్యన్ ఇంకా సారా అలీఖాన్ లు జంటగా నటించారు. లవ్ ఆజ్ కల్ 2 చిత్రంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండు విభిన్నమైన ప్రేమ కథలను సమాంతరంగా చూపిస్తూ కథను నడిపించాడు. ఈ చిత్రంకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ట్రైలర్ లోని పలు షాట్స్ లో సారా అలీ ఖాన్ నటనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి రెండు చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో సారా నటన మరీ నాసిరకంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ఓవర్ యాక్షన్ ను కొందరు తప్పుబట్టారు. ట్రైలర్ లోనే ఈ స్థాయి ఓవర్ యాక్షన్ ఉంటే సినిమా మొత్తంలో ఈమె ఓవర్ యాక్షన్ ను తట్టుకోగలమా అంటూ కొందరు మీమ్స్ చేయడం మొదలు పెట్టారు.

లవ్ ఆజ్ కల్ 2 చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సారా అలీ ఖాన్ ఒక టాక్ షో లో పాల్గొంది. ఆ సందర్బంగా ఈ అమ్మడు తనపై వస్తున్న మీమ్స్ మరియు ట్రోల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన నటనపై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. నా ఫిజిక్ పై కామెంట్స్ చేసినా విమర్శలు చేసినా కూడా నేనేం పట్టించుకోను. కాని నా నటనపై కామెంట్స్ చేయడం చాలా బాధగా ఉంది.. అది నా మనసును నొప్పించింది అంటూ ఎమోషనల్ అయ్యింది.
Please Read Disclaimer