తన తండ్రి రెండో భార్యపై హీరోయిన్ ప్రేమగా!

0

సాధారణంగా తండ్రి రెండో భార్యను చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసినవే. గ్రామీణ స్థాయిల్లో చూసుకున్నా ప్రముఖుల జీవితాల్లోని రెండో మహిళ వ్యవహారాలను గమనించినా అలాంటి తీరే అగుపిస్తూ ఉంటుంది. తమ తల్లి ని కాదని తండ్రి మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని చాలా మంది పిల్లలు భరించలేరు.

తమ పిన్నిని వారు ద్వేషిస్తూ ఉంటారు. రెండో పెళ్లి చేసుకున్న తండ్రిని ద్వేషించరు కానీ – పిన్ని మీద మాత్రం కస్సుమంటూ ఉంటారు. కొందరు మాత్రం దానికి మినహాయింపు. బాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉన్నాయి. బోనీకపూర్ – శ్రీదేవి విషయంలో అర్జున్ కపూర్ తీరు బాగా చర్చలో నిలిచేది. శ్రీదేవి బతికున్న రోజుల్లో ఆమె ఉనికిని అర్జున్ కపూర్ అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పేవాడు. శ్రీదేవి కూతుళ్లను కూడా పట్టించుకునే వాడు కాదు. అయితే శ్రీదేవి మరణం తర్వాత అతడి తీరు మారింది.

ఇక ఇలాంటి కథే సైఫ్ అలీఖాన్ ఖాన్ ది కూడా. మొదటి భార్య అమృతాసింగ్ తో అతడికి ఇద్దరు పిల్లలు. తనకన్నా పెద్దదైన అమృతను పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చాడు సైఫ్. ఆ తర్వాత కొన్నేళ్లకు కరీనా కపూర్ వంటి కుర్రదాన్ని అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆమెతోనూ సంతానం కలిగింది.

ఇక తన మొదటి భార్య పిల్లలతో సైఫ్ చాలా బాగుంటాడు. వారు కూడా తండ్రి మీద ప్రేమతో అగుపిస్తూ ఉంటారు. వారిలో సారా అలీఖాన్ ఇటీవలే హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సైఫ్ రెండో పెళ్లికి కూడా హాజరైంది సారా. తాజాగా కరీనా విషయంలో ఆమె మరోసారి స్పందించింది.

కరీనా అంటే తనకు చాలా గౌరవం అని – తన తండ్రి రెండో భార్యగా ఆమెను ప్రేమిస్తానని సారా అంటోంది. ఆమెతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని తనకు ఆమె ఫ్రెండ్ కన్నా ఎక్కువే అని సైఫ్ కూతురు అంటోంది.
Please Read Disclaimer