సారా బికినీ అందాలు..ఔరా!

0

బాలీవుడ్ లో చాలామంది స్టార్ కిడ్స్ ఉన్నారు కానీ వారిలో సక్సెస్ అయిన వారు మాత్రం తక్కువ మందే. అలాంటి తక్కువ మందిలో సారా అలీ ఖాన్ కూడా ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమా ‘కేదార్ నాథ్’ తోనే ఒక విజయం తన ఖాతాలో వేసుకుంది. రెండో సినిమా ‘సింబా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ తరం స్టార్ కిడ్ కావడంతో సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఉంది.

సారా ప్రస్తుతం మాల్దీవ్స్ లో న్యూ ఇయర్ వెకేషన్ గడుపుతోంది. చాలామంది సెలబ్రిటీలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చారు కానీ సారా మాత్రం ఇంకా తన ట్రిప్ ముగించలేదు. ఆ అందమైన ప్రదేశంలో ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ “హలో వీకెండ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లైట్ గ్రీన్ కలర్ బికినీ ధరించి కత్తి లాంటి పోజులు ఇచ్చింది. నీటిలో మునుగుతూ.. శిరోజాలు సవరించుకుంటూ.. నీటి నుంచి పైకి లేస్తూ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటో షూట్ ను పూర్తి చేసింది. బికినీ కాబట్టి.. ఆటోమేటిక్ గా అందాల విందు జరుగుతుంది కదా. బికినీలో పాలరాతి శిల్పంలాగా ఉంది.

ఈ ఫోటోకు వన్ మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. అనుష్క శర్మ లాంటి స్టార్ హీరోయిన్లు లైక్ కొట్టారు. సాధారణ నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. “బ్యూటిఫుల్ బికినీ”.. “సారా ఆన్ ఫైర్”.. “హాటెస్ట్ బేబ్” అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘లవ్ ఆజ్ కల్’ సీక్వెల్ లో నటిస్తోంది. ‘కూలీ నెం.1’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer