ఆ నవ్వుకు కుర్రకారు మటాషే

0

నటవారసురాలిగా తెరంగేట్రం చేసినా షార్ట్ టైమ్ లోనే తనదైన మార్క్ తో దూసుకొచ్చింది సారా అలీఖాన్. స్టార్ హీరో సైఫ్ ఖాన్ – అమృత జంట వారసురాలిగా సారా పరిశ్రమలో అడుగు పెట్టి తనదైన అందం నటనతో ఆకట్టుకుంటోంది. కేదార్ నాథ్- సింబా లాంటి చిత్రాల్లో నటించిన సారా ప్రస్తుతం లవ్ ఆజ్ కల్ సీక్వెల్ లో నటిస్తోంది. ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడు. త్వరలో రిలీజ్ సందర్భంగా కార్తీక్- సారా జంట ప్రచార కార్యక్రమాల్లో పూర్తి బిజీగా ఉన్నారు.

`లవ్ ఆజ్ కల్` ట్రైలర్ రిలీజైంది మొదలు సారా- కార్తీక్ కెమిస్ట్రీ గురించి యువతరంలో ఆసక్తికర చర్చ సాగింది. మునుపటితో పోలిస్తే సారా హద్దులు చెరిపేసి చెలరేగుతోందన్న టాక్ యూత్ లో ఉంది. ఇక సారా రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా రూపలావణ్యం మెయింటెయిన్ చేసేందుకు ఎంతగా శ్రమిస్తుందో తెలిసిందే. సారా రెగ్యులర్ వర్కవుట్లలో భాగంగా జిమ్ నుంచి వస్తూ పొట్టి నిక్కరు ట్రీటివ్వడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఏమైందో కాస్తంత కొత్త లుక్ లో కనిపించింది. ఇంతకుముందు చిట్టి పొట్టి నిక్కర్లలో.. షార్ట్స్ తో కనిపించిన సారా అందుకు పూర్తి భిన్నమైన లుక్ లో కనిపించి షాకిచ్చింది. వైట్ అండ్ వైట్ భారతీయ వస్త్రధారణతో నిండుగా కనిపించి షాకిచ్చింది. సారా ఏ డ్రెస్ లో కనిపించినా ఆ అందం నవ్వు కుర్రకారును ఇట్టే ఆకర్షిస్తుందనడానికి ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

ప్రేమికుల రోజు కానుకగా `లవ్ ఆజ్ కల్ 2` ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. తదుపరి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న కూలీ నెం 1 లో వరుణ్ ధావన్ సరసన సారా ఖాన్ నటిస్తోంది. ఈ చిత్రం 2020 మే 1 న విడుదల అవుతుంది. వరుసగా సీక్వెల్ కథల్లో సారాకు అవకాశం దక్కుతోంది. అయితే నేటి తరానికి తగ్గట్టుగా వీటిని మలిచేందుకు దర్శకులు ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తుండడం ఇంట్రెస్టింగ్.
Please Read Disclaimer