బికినీ మోనాలిసా బాప్ రే

0

స్టార్ కిడ్ సారా అలీఖాన్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. నటించింది రెండు సినిమాలే అయినా బాలీవుడ్ సర్కిల్స్ లో నిరంతరం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ఇన్ స్టాలోనే రెగ్యులర్ ట్రీట్ ఇస్తూ ఇస్మార్ట్ గా పాపులర్ అయిపోతోంది. తాజాగా ఈ అమ్మడి మాల్దీవుల విహారం సంచలనమైన సంగతి తెలిసిందే. తల్లి అమృత.. సోదరుడితో కలిసి వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది సారా. అక్కడ బికినీల్లో చేస్తున్న రచ్చ మమూలుగా లేదు. బ్రదర్ ఇబ్రహీంతో కలిసి నానా నచ్చ చేసింది. దీనికి సంబందించిన ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ చేసి రచ్చకు తెరలేపిన సారా ఆ తరువాత బికినీ షూట్ లో పీక్స్ కి చేరుకుంది అందాల ఎలివేషన్ తో సన్ బాత్ చేసింది. ఇక బీచ్ పరిసరాల్లో ఈ అమ్మడు ఇచ్చిన ఆ కిల్లింగ్ ఫోజు చూస్తుంటే సన్ బాత్ లో బికినీ మోనాలిసవా? అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.

అంతగా ఆ ఫోటో సారా అభిమానులకు గిలిగింతలు పెట్టేస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్ని ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సారా మాల్దీవుల్లో సుదీర్ఘ వెకేషన్ ని ఎంజాయ్ చేసింది. కెరీర్ లో సారా ఇప్పటి వరకు చేసింది రెండే రెండు సినిమాలు. అందులో తొలి సినిమా భారీ ఫ్లాప్. ఆ తరువాత రణ్ వీర్ సింగ్ తో చేసిన `సింబా` బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. దీంతో సారా హడావిడి మామూలుగా లేదు. ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది.

ఇందులో ఒకటి `రాక్స్టార్` ఫేమ్ ఇంతియాజ్ అలీ చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. అలాగే వరుణ్ ధావన్ సరసన `కూలీ నం.1` లోనూ నటిస్తోంది. ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 14న రాబోతుండగా.. మే 1న `కూలీ నెం.1` రిలీజ్ కాబోతోంది.
Please Read Disclaimer