సారా పూల్ సైడ్ ట్రీట్ షాకిస్తోందే

0

స్టార్లంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వేడుకల పేరుతో ఫుల్ గా చిలౌట్ చేసిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ వారసురాలు సారా అలీ ఖాన్ తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ప్రస్తుతం సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది. సారా.. ఇబ్రహీం మాల్దీవుల విహారానికి వెళ్లారు. అక్కడ ఓ ఈత కొలనులో స్విమ్ చేసిన అనంతరం అల్పాహారాన్ని ఆస్వాధిస్తున్న ఫోటోలు తాజాగా రివీలయ్యాయి.

ప్రియమైనవారితో విహారయాత్రలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం సారాని ఎగ్జయిట్ చేసిందిట. క్షణం తీరిక లేనంత బిజీ లైఫ్ తనది. ఆ టెన్షన్స్ నుంచి బయటపడాలంటే అయినవారితో ఏదో ఒక సెలబ్రేషన్ ప్లాన్ చేయాలని భావించిందట. ఆ క్రమంలోనే సోదరునితో కలిసి మాల్దీవుల విహారాన్ని ప్లాన్ చేసింది. సారా- ఇబ్రహీంల మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోల్ని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. `కూలీ నంబర్ 1` షూటింగ్ నుంచి విరామం తీసుకుని మరీ సారా ఇలా టైమ్ పాస్ చేసిందట.

పూల్ సైడ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సారా బికినీ ట్రీట్ వైరల్ గా మారింది. మాల్దీవియన్ బ్లూస్ ప్రాంగణంలో సారా తన చేతిలో ఓ కప్ తో కేక్ పట్టుకుని మిలియన్ డాలర్ స్మైల్ తో మైమరిపిస్తోంది. ఇక సారా కెరీర్ ని పరిశీలిస్తే.. ప్రస్తుతం లవ్ ఆజ్ కల్ సీక్వెల్ లో నటిస్తోంది.ఈ సినిమా డబ్బింగ్ దశలో ఉంది. హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఇటీవల సారా డబ్బింగ్ చెప్పింది. ఇక ఈ చిత్రంలో రణదీప్ హుడా ఓ కీలక పాత్రను పోషించాడు. లవ్ ఆజ్ కల్ 2020 వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. అలాగే కూలీ నెంబర్ 1 లో వరుణ్ ధావన్ సరసన సారా నటిస్తోంది. ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2020 మే 1 న విడుదల కానుంది.
Please Read Disclaimer