ఫ్యాన్స్ కోసం టూరిస్టుగా మారిన సారా..

0

సారా అలీఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న యంగ్ హీరోయిన్. కొద్దికాలంలోనే విపరీతమైన క్రేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్పుడీ సుందరి కుర్రకారుకి అతిలోకసుందరిగా మారిందంటే నమ్మకతప్పదు. ఎందుకంటే సారా ఇప్పుడు ఏం చేసినా ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా కంటే కూడా తను సొంతంగా తన అందం అభినయంతో అభిమానులను పొందుతుంది అనడంలో సందేహం లేదు.

చేసింది మూడు సినిమాలే అయినా తన నటన తో ప్రశంసలు అందుకుంటుంది. ఈ మధ్యే ‘లవ్ ఆజ్ కల్’ చిత్రంలో నటించిన సారా.. విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడుతుంది. అయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వారణాసిలో కాస్త ఆధ్యాత్మిక సమయాన్ని గడపడానికి వెళ్ళింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఇంస్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పింక్ కలర్ సల్వార్ కమీజ్ ధరించి నుదిటిన తిలకం పెట్టుకొని వారణాసి వీధులన్నీ పర్యటించింది.

సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో ట్రెండింగ్ లో ఉంది. సారా వారణాసిలో వెలసిన దేవుడికి భక్తురాలైతే.. మేమంతా నీకు భక్తులమంటూ అభిమానులు తమ ఆనందాన్ని ఇంస్టా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే సారా వరుణ్ ధావన్ సరసన ‘కూలి నెం.1’ సినిమాలో కనిపించనుంది. అనంతరం ధనుష్ తో కూడా నటించనుంది. చూస్తుంటే సారా వయ్యారాలకు అభిమానులే కాదు హీరోలు కూడా క్యూ కట్టేలా ఉన్నారు. ఈ ఏడాదంతా సారా అభిమానులకు పండగే అనడం సబబే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-