మిడ్డీకి ఎక్కువ బికినీకి తక్కువ

0

అందంగా కనిపించడం ఒక ఆర్ట్. అందాలతో కనువిందు చేయడం మరో రకం ఆర్ట్. ఈ రెండిటిలో ఆరితేరిన భామామణులకు కొదవేం లేదు. బాలీవుడ్ సర్కిల్స్ లో నటవారసురాళ్ల వెల్లువ ఠఫ్ కాంపిటీషన్ వల్ల ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ ప్రమోషన్స్ కి తావిస్తోంది. జాన్వీ- సారా అలీఖాన్- అనన్య పాండే లాంటి నవతరం నాయికలు ఒకరి తో ఒకరు పోటీ పడుతూ హీటెక్కించేస్తున్నారు.

గత కొంతకాలంగా మాల్దీవుల వెకేషన్ లో బులుగు జిలుగు సముద్రంలో సారా అలీఖాన్ ఇచ్చిన ట్రీట్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే సోషల్ మీడియాల్లో సారా బికినీ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సారా అలీఖాన్ మాల్దీవుల వెకేషన్ ముగించి ముంబై లో అడుగు పెట్టింది. యథావిధి గా తిరిగి రేస్ లోకి వచ్చేసింది సారా.

తాజాగా బులుగు మిడ్డీలో సారా విరవిహారం హాట్ టాపిక్ గా మారింది. ఇది మిడ్దీకి ఎక్కువ బికినీ కి తక్కువ! అంటూ యూత్ ఒకటే కామెంట్లతో రెచ్చిపోతున్నారు. సింపుల్ లుక్.. సంథింగ్ హట్ అంటూ సారాపై ప్రశంసలు కురుస్తున్నాయి. సారా ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న `లవ్ ఆజ్ కల్ 2` లో నటిస్తోంది. కూలీ నంబర్ 1 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. 2020లో సారా డైరీ ఫుల్ గానే ఉంది మరి.
Please Read Disclaimer