పంజా బ్యూటీ ఎంత చెలరేగినా కానీ..!

0

`పంజా` బ్యూటీ సారా జేన్ డయాస్ గురించి పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఎంట్రీ మూవీ పంజా డిజాస్టర్ అవ్వడం ఈ అమ్మడికి అన్నిరకాలా నెగెటివ్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఆఫర్ అన్నదే లేదు. తొలి పరాభవం అనంతరం సారా అటు తమిళం.. హిందీలో అవకాశాలు వెతుక్కునే పనిలో పడింది.

ఇక సోషల్ మీడియాలో ఇతర భామల్లానే నిరంతరం వేడెక్కించే ఫోటో ట్రీట్ తో చెలరేగుతోంది. అయినా ఆఫర్ మాత్రం నిల్. తాజాగా సారా మరో కొత్త ఫోటోషూట్ తో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఎంతో జోష్ తో ఆదమరిచి మైమరిచి స్టెప్పులేస్తోంది సారా.

అలా మైమరిచి చేసే నృత్యాల్లో సారా థై సొగసులు ట్రీటిచ్చినా .. మరీ ఇలా ఫ్యాట్ బాడీని ఎలివేట్ చేయడం కుర్రకారుకు నచ్చడం లేదు. ఆ నడుము సొగసు.. థై సొంపులు కిర్రెక్కించేస్తున్నాయ్ అంటూ కామెంట్లు రువ్వుతున్నారు బోయ్స్. ప్రస్తుతం ఫేడవుట్ బ్యూటీస్ జాబితా నుంచి బయటపడాలంటే ఇలాంటి స్టింట్ తప్పనిసరి అని గ్రహించినట్టే ఉంది.

ఇటీవలే ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ లో నటించిన సారా స్టార్ స్పోర్ట్స్ రిపోర్టర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. క్రికెటర్ తో ఎఫైర్ నడిపించిన కిలాడీ జర్నలిస్టుగా మైమరిపించింది. 2017లో నటించిన వైస్రాయ్ హోటల్ తర్వాత బాలీవుడ్ లో మరో ఆఫర్ లేదు. కనీసం ప్రస్తుత ప్రయత్నాలు చూస్తుంటే 2020లో అయినా సారా కెరీర్ గ్రాఫ్ మారుతుందనే భావించారు. కానీ ఇంతలోనే కరోనా మహమ్మారీ అమ్మడి ప్రయత్నాలకు బ్రేక్ వేసింది.