అరే తంబీ ఆ సంపుడేంది!

0

హీరో అంటే ఒడ్డు పొడుగు.. అందం ఆకారం.. శరీర కొలతలు అంటూ ఏవేవో లెక్కలు ఉండేవి ఒకప్పుడు. అందరూ శోభన్ బాబులా అందంగా కుదురుతారా. ఆ లెక్కలన్నీ తప్పి చాలా కాలమే అయ్యింది. ఈరోజుల్లో సంపూర్ణేష్ అయినా.. ధన్ రాజ్ అయినా హీరో కాగలరని ప్రూవైంది. హీరోయిజంలో రకరకాల జోనర్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక జోనర్ కి ఆకారంతో పని లేకుండా ఫిట్ అవుతున్నారు. శీకాకుళం నుంచి షకలక శంకర్ వచ్చి చితకేస్తుంటే అల్ట్రా పోష్ తెలుగు ఆడియెన్ చూడటం లేదూ? ఇండస్ట్రీ పెద్ద మనుషుల్ని తత్తరించిన ధీరుడని నిరూపించాడు ఈ డేరున్న కుర్రాడు. నాకు అవకాశాలివ్వకుండా నాన్చుతార్రా! అంటూ డైరెక్టుగానే లైవ్ లో ఏస్కున్నాడు.

అయితే వీళ్లందరి సీన్ వేరు అనుకుంటే.. ఇడిగో ఇక్కడ కనిపిస్తున్న తంబీ హీరో గారి సీన్ వేరేగా ఉంది మరి. ఈయన ఏదో కామెడీ హీరో అనుకునేరు. అతడు సీరియస్ హీరోనే. పైగా అల్ట్రా రిచ్ గయ్ గా తమిళనాడులో ధనిక వర్గాలకు సుపరిచితుడు కావడంతో డెబ్యూ సినిమాకు పెట్టుబడికి కొదవేమీ లేదు. అయితే ఆయన నిర్మాతగా మారి సినిమాలు తీయకుండా.. ఉన్నట్టుండి నేను హీరోనే! అంటూ బరిలో దిగడంతోనే అంతా ఖంగు తిన్నారు. అదేదో శంకర్ సినిమాలోనో … రజనీ సినిమాలోనో పీతాంబరంని చూపించినట్టు ఈయన కూడా సినిమా హీరోనే ! అన్నట్టుగా ఉంది వ్యవహారం.

ఆ గెటప్పు.. స్టైల్ .. స్టింట్ చూశాక ఔరా.. ఔరౌరా! అంటూ ముక్కున వేలేసుకోని వాళ్లు లేరు. ఆయన ఫస్ట్ లుక్ రాగానే జనం నిజంగానే చెవులు మూసుకున్నారు. ఏదో తంబీలకో సంపూర్ణేష్ బాబు దొరికాడని భావిద్దాం అనుకుంటే అతడు ఇలయదళపతి రేంజులోనే దూసుకొస్తుండడం ఉత్కంఠకు తావిస్తోంది. అసలింతకీ ఎవరీయన? అంటే.. శరవణ స్టోర్స్ అండ్ శరవణ గ్రూప్స్ వారస పుత్ర రత్నం. పేరు శరవణ. జేడీ అండ్ జెర్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు. పైగా ఈ చిత్రంలో ఈ సోగ్గాడి సరసన అందాల నయనతారను ఒప్పించాలని చూశారు. కానీ ససేమిరా అనడంతో గీతిక తివారి అనే కొత్తమ్మాయితో సరిపెట్టుకున్నారట.

ఈయన తెగువ చూశాక.. హీరోయిజం అంటే బిర్ర బిగుసుకుని ఎత్తు పళ్లు చూపడమే అనుకుంటున్నాడా ఏమిటీ అంటూ అతడిపై ఇప్పటికే నెటిజనుల్లో ఘాటైన కామెంట్లు పడిపోతున్నాయ్. సోషల్ జనం ఆయన ఫోటోల్ని షేర్ చేస్తూ బోలెడన్ని జోకులు వేస్తూ కామెడీలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్లందరికీ ఈ తంబీ ఎంటర్ ప్రెన్యూర్ గట్టి బుద్ధి చెప్పాలని మరో తంబీ సంపూలా ఎదగాలని కనీసం మనమైనా కోరుకుందాం.




Please Read Disclaimer