సరిలేరు టీంకు సూపర్ పార్టీ

0

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై మహేష్ బాబు చాలా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని ఉత్సాహంగా ఈ చిత్రంలో మహేష్ బాబు కనిపించబోతున్నాడనిపిస్తుంది. ఇంతటి మంచి సినిమాను తనకు ఇచ్చినందుకు మహేష్ బాబు దర్శకుడు అనీల్ రావిపూడితో పాటు మొత్తం చిత్ర యూనిట్ సభ్యులకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఇక నిన్న చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా పార్టీ ఇచ్చాడు.

నిన్న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు అవ్వడంతో షో మరింత అదిరి పోయింది. ప్రీ రిలీజ్ వేడుక పూర్తి అయిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా మహేష్ బాబు ఇంటికి చేరుకున్నారట. అర్థరాత్రి సమయంలో మహేష్ బాబు ఇంట్లో చిత్ర యూనిట్ సభ్యులు అందరికి స్వయంగా మహేష్ బాబు పార్టీ ఇచ్చాడు. ఈ ఫొటో నిన్న రాత్రి పార్టీ సందర్బంగా తీసుకున్నదే.

మహేష్ బాబు ఇచ్చిన పార్టీలో చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి.. హీరోయిన్ రష్మిక మందన్న.. మరో హీరోయిన్ తమన్నా.. నిర్మాత అనీల్ సుంకర దర్శకుడు వంశీ పైడిపల్లి రచయిత రామ జోగయ్య శాస్త్రీ.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా పలువురు టెక్నీషియన్స్ మరియు నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. సినిమాను ఈనెల 11న విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అవ్వబోతున్నారు. సంక్రాంతికి మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగ డబుల్ అవ్వడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అందుకే మహేష్ ముందే సక్సెస్ పార్టీ ఇచ్చాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer