మెగా స్టార్ అనౌన్స్ మెంట్ చేస్తారట

0

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయాయి. అందరూ ఎప్పుడు థియేటర్స్ లో అడుగుపెట్టి సినిమాలు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అనుకోకుండా మళ్ళీ రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. దర్బార్ ఎంత మంచి వాడవురా అవే డేట్స్ కి ఫిక్సయిపోతే… మహేష్ సరిలేరు నీకెవ్వరు బన్నీ ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్స్ లో మార్పు జరిగేలా కనిపిస్తుంది.

జనవరి 12 న రిలీజ్ కానున్న ‘అల వైకుంఠపురములో’ మళ్ళీ 10 న వచ్చే అవకాశాలున్నాయంటూ ఓ లీక్ వదిలారు. దీంతో ఫ్యాన్స్ లో రిలీజ్ డేట్ పై ఆసక్తి పెరిగిపోయింది. కట్ చేస్తే అల వైకుంఠపురములో డేట్ మారితే మహేష్ సినిమా డేట్ కూడా మార్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికైతే అఫీషియల్ గా ప్రకటించిన అవే డేట్స్ కె సినిమాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటే మేకర్స్ మాత్రం ఇంకా ఊగిసలాటలు ఆడుతున్నారు.

ఇక సరిలేరు నీకెవ్వరు కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎల్.బి.స్టేడియంలో ఈ నెల 5న గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మెగాస్టార్ తో మరో సారి రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు యూనిట్. అందుకే తాజాగా సెన్సార్ పోస్టర్ మీద కూడా డేట్ వేయకుండా సంక్రాంతి రిలీజ్ అంటూ వదిలారు. మరి మెగా స్టార్ చెప్పే ఆ తేదిలో ఏదైనా మార్పు ఉంటుందా లేదా పాత డేట్ నే మళ్ళీ మెగా నోటి ద్వారా చెప్పిస్తారా చూడాలి.
Please Read Disclaimer