సంక్రాంతి పోటీ లో కన్వీన్స్ చేశారా? కన్వీన్స్ అయ్యారా?

0

సంక్రాంతి వస్తుందంటే.. సినిమా రిలీజ్ హడావుడి ఉంటుంది. అగ్రతారలు తమ సినిమాలు ఆ సీజన్ లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ రోజున భారీ ఎత్తున థియేటర్ల లో తమ సినిమాను విడుదల చేసి.. మొదటి వారంలోనే మొత్తాన్ని రాబట్టేసుకునే విధానాన్ని ఫాలో అవుతున్న పరిస్థితి. ఇందుకు తగ్గట్లే రిలీజ్ క్లాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బడా నిర్మాతలు.

సంక్రాంతి సీజన్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించే బడా నిర్మాతల మధ్య పోటీ అనివార్యంగా మారుతుంటోంది అప్పుడప్పడు. వచ్చే సంక్రాంతికి ఇలాంటి పరిస్థితే ఉంది. తొలుత ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల విషయంలో పోటీ పడతాయాన్న సస్పెన్స్ తీరిపోయి.. రాజీ ఫార్ములా ను ఫాలో కావటం తెలిసిందే. దీంతో రిలీజ్ వార్ కు పుల్ స్టాప్ పడుతోంది. మహేశ్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురము లో సినిమాలు జనవరి 12న విడుదల అవుతాయని ప్రకటించారు కానీ.. తర్వాత జరిగిన చర్చల కారణంగా రిలీజ్ డేట్ మారింది.

మరి.. ఈ విషయం లో దిల్ రాజు ఏం చేశారు? తన సినిమా సరిలేరునీకెవ్వరు తొలుత రిలీజ్ అయ్యేలా.. ఆ తర్వాతి రోజు అల్లు అర్జున్ సినిమా విడుదలయ్యేలా ఏం చేశారన్న దిల్ రాజు ప్రశ్నకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు. కన్వీన్స్ చేశారా? కన్వీన్స్ అయ్యారా? అన్న సందేహానికి సమాధానం ఇస్తూ.. ఏదైనా విషయం ఒకటేగా అంటూ తేల్చేశారు. రెండు పెద్ద సినిమాలే అన్న దిల్ రాజు నిర్మాతల గిల్డు జరిపిన చర్చల్లో తాము కన్వీన్స్ అయినట్లుగా పేర్కొన్నారు. తెర వెనుక ఏం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పకుండానే విషయాన్ని పక్కకు పెట్టేసిన ఆయన తీరు చూస్తే.. ఇలాంటిదే ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేస్తుందని చెప్పక తప్పదు.