బుల్లెట్టుపై దిగాడు చందురుడిలా

0

సరిలేరు నీకెవ్వరు .. ప్రచారం మామూలుగా లేదుగా. ఒక్కో పోస్టర్ తో ఫ్యాన్స్ గుండెల్లోకి దూసుకుపోతున్నారు. వినాయక చవితి.. దసరా.. దీపావళి అకేషన్ ఏదీ విడిచిపెట్టడం లేదు. ఎప్పటికప్పడు ఫ్రెష్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ వేడి పెంచేస్తున్నారు. పండగలు వస్తే సరికొత్తగా స్టార్ల మధ్య పోటీ కూడా అదే తీరుగా కనిపిస్తోంది. ఇంటిల్లి పాదీ తమ పోస్టర్లు చూడాలని పండగ చేసుకోవాలని ఎత్తుగడ అయ్యుండొచ్చు.

నేటి ఉదయమే దీపావళి శుభాకాంక్షలతో `సరిలేరు..` నుంచి భారతి మ్యాడమ్ లుక్ ఇదే అంటూ విజయశాంతి లుక్ రిలీజ్ చేసిన అనీల్ రావిపూడి బృందం ఇంతలోనే 5.04 పీఎం కి చెప్పినట్టుగానే సూపర్ స్టార్ మహేష్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ పూర్తిగా ఫెస్టివల్ లుక్ లో కనిపించింది. ఇంతకుముందులా ఆర్మీ లుక్ కాకుండా కొత్తగా పార్మల్ టీస్ లో బుల్లెట్టు మీద తాపీగా వెళుతూ కనిపించాడు మహేష్. బ్లాక్ టీస్ కాంబినేషన్ కాఫీ కలర్ ఫ్యాంట్ ఆకట్టుకున్నాయి. ఏపీ 21 జీక్యూ0298 బండి మాంచి కిర్రాక్ గా ఉంది. దానిపై చందురుడిలా స్మార్ట్ గా కనిపిస్తున్న మహేష్ సంగతి సరే కానీ .. కాస్త బ్యాక్ గ్రౌండ్ లోకి చూస్తేనే హారిబుల్ గా ఉంది సీన్. అక్కడ పూర్తిగా సీరియస్ వాతావరణం కనిపిస్తోంది. కర్నూల్ కొండారెడ్డి బురుజుకు వచ్చాక చాలా మ్యాటరే ఉందని ఆ సీన్ చెబుతోంది.

రాజకీయ నాయకుడైన ప్రకాష్ రాజ్ ఫ్లెక్సీ ఒకటి చెయ్యి చూపిస్తూ .. మీరే నా దేవుళ్లు! అంటున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ పోస్టర్ ముందే పోలీసులతో ఏదో వాగ్వివాదం సాగుతోంది. జనం తోసుకుంటూ ముందుకొస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బార్డర్ నుంచి దిగిన ఆర్మీ చిన్నోడికి చాలానే ఛాలెంజ్ లు ఎదురయ్యాయని అర్థమవుతోంది. మొత్తానికి సూపర్ స్టార్ లుక్ అదిరింది. ఈ భారీ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ 2020 జనవరి 12న రిలీజ్ కానుంది. అనీల్ సుంకర- దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer