‘మైండ్ బ్లాంక్’ తో మొదలవ్వబోతున్న సరిలేరు నీకెవ్వరు సందడి

0

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు ఇంకా నెలన్నర రోజుల సమయం ఉంది. ఇప్పటి నుండే సినిమా సందడి షురూ అవుతోంది. ఇప్పటికే టీజర్ తో రికార్డులు సృష్టించిన మహేష్ బాబు సరికొత్త ప్రమోషన్ పద్దతితో డిసెంబర్ నెల మొత్తం కూడా సందడి చేయబోతున్నాడు. డిసెంబర్ లోని ప్రతి సోమవారం ఒక పాట చొప్పున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ప్రతి వారం ఒక పాటతో ఆడియన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రం పాటల్లో మొదటి పాట మైండ్ బ్లాంక్ ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నేడు సాయంత్రం 5.04 గంటలకు మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాట రాబోతున్న ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా నమ్మకంతో పాట కోసం ఎదురు చూస్తున్నారు.

మహేష్ బాబు.. దేవిశ్రీ ప్రసాద్ ల కాంబోలో వచ్చిన గత చిత్రాల పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ ఆల్బమ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ మరియు ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబుకు జోడీగా రష్మిక నటించిన ఈ సినిమాలో రాములమ్మ విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది. డబుల్ క్రేజ్ ఉన్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
Please Read Disclaimer