మేకింగ్ వీడియో: సరిలేరు టీమ్ ఫుల్ జాయ్

0

సంక్రాంతి పందెంలో మహేష్ జోరుకు ప్రత్యర్థి కళ్లెం వేస్తారా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఇక ప్రచారంలో సరిలేరు చిత్రబృందం అందరికంటే స్పీడ్ మీద ఉంది. ఎప్పటికప్పుడు క్రియేటివ్ పంథా లో ప్రమోషన్ చేస్తూ అనీల్ రావిపూడి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.

ఇప్పటికే `సరిలేరు నీకెవ్వరు` ప్రచార చిత్రాలు.. పోస్టర్లు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. లిరికల్ సాంగ్స్ కి రెస్పాన్స్ బావుంది. జనవరి 11 న రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయనుందో అన్న ఆసక్తి నెలకొంది. ఒక పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఇందులోనే యాక్షన్.. సెంటిమెంట్ .. ఎమోషన్ పీక్స్ లో ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు నుంచి కోరుకునే అన్నిరకాల మసాలాలు సినిమాలు ఉన్నాయట. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

లేటెస్టుగా సరిలేరు నీకెవ్వరు మేకింగ్ వీడియో ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నది. ఆన్ లొకేషన్ మహేష్ ఎంతో జోవియల్ గా ఉంటారు. ఆయనే కాదు సరిలేరు టీమ్ లొకేషన్ లో సరదాగా జోక్స్ వేసుకుంటూ షూట్ చేయడం కనిపిస్తోంది. సీరియస్ నెస్ అన్నదే లేకుండా ఎంతో హాయిగా సరదాగా సినిమాను పూర్తి చేశారు. మేకింగ్ వీడియో అంతర్జాలం లో జెట్ స్పీడ్ గా దూసుకెళుతోంది.
Please Read Disclaimer