సంక్రాంతి ఫైట్: ముందు ప్రకటించిన తేదీలకే

0

2020 సంక్రాంతి బిగ్ ఫైట్ కన్ఫామ్ అయ్యింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజవుతున్నాయి. వీటిలో అల వైకుంఠపురములో- సరిలేరు నీకెవ్వరు మధ్యనే సిసలైన పోటీ. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ తేదీ విషయంలో ఇటీవల డైలమా నెలకొందన్న ప్రచారం వేడెక్కించింది. జనవరి 12న వస్తున్నాం! అంటూ ఇరు సినిమాల తేదీల్ని ప్రకటించినప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమస్యను పరిష్కరించింది. మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేసేందుకు అంగీకరించి పోస్టర్ వేశారు.

అయితే ఊహించని విధంగా ఇటీవల సీన్ మారింది. అల వైకుంఠపురములో అంతకంటే ముందే వచ్చేస్తోంది అన్న ప్రచారం వేడెక్కించింది. దీంతో సంక్రాంతి పుంజుల మధ్య బిగ్ ఫైట్ మరో లెవల్ కి చేరుకోబోతోందా? అన్న చర్చా సోషల్ మీడియాలో సాగింది. ఎట్టకేలకు మరోసారి నిర్మాతల గిల్డ్ దీనికి పరిష్కారం వెతికింది. ఇరు వర్గాల్ని పిలిచి మాట్లాడి ముందే ప్రకటించిన తేదీలకే ఫిక్స్ చేసింది.

దిల్ రాజు మాట్లాడుతూ..“ ఇదివరకూ గిల్డ్ మీటింగ్ లో సరిలేరు నీకెవ్వరుని జనవరి 11న.. అల వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలతో మాట్లాడి ప్రకటించాం. కానీ ఇటీవల కొన్ని పరిణామాలతో జనవరి 10 లేదా 11న అల వైకుంఠపురములో విడుదలవుతుందని ప్రచారమైంది. దీంతో మరోసారి ఇరు నిర్మాతలతో మాట్లాడి కన్విన్స్ చేశాం. అందరూ బావుండాలనే ప్రయత్నమే ఇది. అందుకు ఒప్పుకున్నారు. ఈ రెండిటితో పాటు మరో రెండు సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. గత సంక్రాంతి లానే ఈసారి రిలీజవుతున్నాయి. అన్ని సినిమాలకు రెవెన్యూ బాగా రావాలన్నదే మా ఆలోచన“ అని తెలిపారు.
Please Read Disclaimer