సరిలేరు డిస్ట్రిబ్యూటర్స్ లిస్టు వచ్చేసిందోచ్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. దానికితోడు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రోమోస్ కూడా సినిమాపై హైప్ ను పెంచాయి. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కు భారీ స్పందన దక్కింది.

సాధారణంగానే మహేష్ బాబు సినిమాలకు ట్రేడ్ సర్కిల్స్ లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ కానుండడం.. ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది. అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ‘సరిలేరు నీకెవ్వరు’ థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరలకు సొంతం చేసుకున్నారు. ఇంకా థియేట్రికల్ రైట్స్ లెక్కలు బయటకు రాలేదు కానీ ఏ ఏరియాలో ఎవరు ‘సరిలేరు నీకెవ్వరు’ రైట్స్ చేజిక్కించుకున్నారనే ఇన్ఫో మాత్రం బయటకు వచ్చింది.

సరిలేరు నీకెవ్వరు డిస్ట్రిబ్యూటర్ల లిస్టు ఒకసారి చూడండి.

నైజామ్ & ఉత్తరాంధ్ర: శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్
సీడెడ్: సాయి చంద్ర ఫిలిమ్స్
ఈస్ట్: వింటేజ్ క్రియేషన్స్
వెస్ట్: ఆదిత్య ఫిలిమ్స్
కృష్ణ: క్రేజీ సినిమాస్
గుంటూరు: పద్మాకర్ సినిమాస్
నెల్లూరు: హరి పిక్చర్స్
తమిళనాడు: ఎస్ఎస్సీ మూవీస్
కర్ణాటక: బృంద అసోసియేట్స్
రెస్ట్ అఫ్ ఇండియా: పెన్ ఇండియా
ఓవర్ సీస్: గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ & ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
Please Read Disclaimer