డే 1 రికార్డ్ కోసం సరిలేరు నీకెవ్వరు ప్రయత్నాలు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ తర్వాత రోజే అంటే ఈనెల 12న అల వైకుంఠపురంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనుక రెండవ రోజు కలెక్షన్స్ కాస్త అయినా తగ్గే అవకాశం ఉంది. కనుక డే 1 సాధ్యం అయినంత ఎక్కువగా రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రంకు ఒక నిర్మాత అనే విషయం తెల్సిందే. ఆయన మాస్టర్ ప్లాన్ వేసి మొదటి రోజు ఆరు లేదా ఏడు షో లు పడేలా ప్లాన్ చేస్తున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి షోలకు అనుమతులు రావడం కన్ఫర్మ్ అని.. అందుకే ముందు నుండే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆరు లేదా ఏడు షో లు అది కూడా అత్యధిక స్క్రీన్స్ లో పడేలా ప్లాన్ చేయడం వల్ల నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. నాన్ బాహుబలి రికార్డ్ దక్కించుకోవాలంటే దాదాపుగా 40 కోట్ల వరకు మొదటి రోజే రాబట్టాల్సి ఉంది.

మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ మొదటి రోజు 26 కోట్లను రాబట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమాను మించి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను రాబట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దర్బార్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో కూడా రాత్రి సమయంలో రెండు లేదా మూడు షోలను వేసే విధంగా చర్చలు జరుపుతున్నారట.

అదే జరిగితే సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు 35 నుండి 40 కోట్ల వరకు రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం 300 కోట్ల టార్గెట్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఆ స్థాయిలో రాబట్టాలి అంటే మొదటి రోజు నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేయాల్సి ఉంటుంది.
Please Read Disclaimer