నైట్ పార్టీలు అదరగొడుతున్నారుగా

0

సంక్రాంతి బరిలో వరుసగా సినిమాలు రిలీజవుతున్నాయి. తొలిగా రజనీ నటించిన దర్బార్ రిలీజైంది. ఈ శనివారం మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజవ్వగా.. ఆదివారం (జనవరి 12) బన్ని నటించిన `అల వైకుంఠపురములో` రిలీజైంది. వరుసగా మూడు సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. ఆ క్రమంలోనే సంక్రాంతి విజేత ఎవరు? అంటూ అభిమానుల్లో ఆసక్తిక చర్చ సాగుతోంది.

మహేష్ ఛరిష్మా.. సంక్రాంతి సెలవుల దృష్ట్యా `సరిలేరు నీకెవ్వరు` మంచి ఓపెనింగులే రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక క్రిటిక్స్ నుంచి ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అన్ని రకాల మసాలాల్ని దట్టించి అనీల్ రావిపూడి ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని రూపొందించారు. ఇదంతా ఒకెత్తు అనుకుంటే సరిలేరు ప్రమోషనల్ రచ్చ గురించి తెలిసిందే. రిలీజ్ ముందు అనీల్ రావిపూడి బృందం ప్రచారం హోరెత్తించింది. ఆఫ్టర్ రిలీజ్ అంతే హుషారుగా ప్రమోషన్ చేయనున్నారట. తాజాగా మహేష్ టీమ్ శనివారం నైట్ సక్సెస్ పార్టీ పేరుతో ఇదిగో ఇలా రచ్చ చేసింది. ఇంతకుముందు ప్రీరిలీజ్ అనంతరం పార్టీ తర్వాత సరిలేరు టీమ్ కి ఇది రెండో పార్టీ.

ఈ పార్టీలో చిత్రబృందం అంతా ఎంజాయ్ చేశారని అర్థమవుతోంది. మహేష్ నమ్రత- అనీల్ రావిపూడి- విజయశాంతి- రష్మిక- రాజేంద్ర ప్రసాద్- సంగీత- అనీల్ సుంకర-రత్నవేలు తదితరులు ఈ పార్టీలో ఫుల్ చిలౌట్ చేశారు. ఇక ఈ పార్టీలో క్యూట్ సితార సందడి కన్నులపండుగగా సాగింది మరి.
Please Read Disclaimer