సరిలేరు నీకెవ్వరు వేడుక అంతకు మించి..!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ తో అంచనాలు పెరిగాయి. ఆ హైప్ ను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ వేడుక మరియు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించాలని చిత్ర ప్రమోషనల్ టీం భావిస్తుంది. అందుకోసం భారీ ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఒక రాజకీయ కార్యక్రమం తరహాలో భారీ ఎత్తున నిర్వహించారు. సీఎం ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి హడావుడి చేసి సినిమాకు భారీగా హైప్ తీసుకు వచ్చారు. మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద సినీ వేడుకగా అది నిలిచి పోతుందని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వేడుకను మించేలా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుక నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో ప్రీ రిలీజ్ వేడుక జరిగిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలోనే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక జరపనున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అభిమానులతో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ ను కూడా ఈ వేడుకలో భాగస్వామ్యం చేయాలని సరిలేరు నీకెవ్వరు టీం భావిస్తున్నారు. ఈ వేడుకకు సరి లేదు మరే వేడుక అన్నట్లుగా ఉండబోతుందని యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.
Please Read Disclaimer