సరిలేరు.. టీజర్ ప్రమోషన్ స్ట్రేటజీ అదిరిందే

0

సూపర్ స్టార్ మహేష్ బాబు.. రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఒక వారం క్రితం వరకూ ప్రమోషన్స్ విషయంలో వెనకబడినట్లు అనిపించడంతో మహేష్ అభిమానులు కూడా కాస్త అసంతృప్తికి గురయ్యారు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదలతో ఒక్కసారిగా వారిలో ఫుల్ జోష్ వచ్చేసింది.

జస్ట్ అభిమానులే కాదు. సాధారణ ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై ఉన్న అంచనాలు డబల్ అయ్యాయి. మహేష్ పాత్ర.. యాక్షన్ సీన్స్.. ఆ పంచ్ డైలాగ్స్ చూస్తుంటే ఒక ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ చూడబోతున్నామనే ఫీల్ కలిగింది. ఇక సోషల్ మీడియాలో టీజర్ జోష్ మామూలుగా లేదు. ఇప్పటికే 25 మిలియన్ల వ్యూస్ దాటేసింది. హాఫ్ మిలియన్ లైక్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఇక నిర్మాతలైన ఎకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్ కూడా టీజర్ పై కాంటెస్ట్ లు పెడుతూ ప్రేక్షకులు టీజర్ ను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇలా టీజర్ లోని అంశాలపై 9 ప్రశ్నలు అడిగారు. ఎంతో మంది నెటిజన్లు ఈ ప్రశ్నలకు బదులిస్తూ టీజర్ పై ఆసక్తి కొనసాగేలా చేస్తున్నారు.

ఆ ప్రశ్నల పరంపరలో 9 వ పశ్నను గమనిస్తే “టీజర్ లో ఒక పక్షి క్యామియో ఉంది. దానికి అర్థం ఏంటి?” ఫ్యాన్స్ ను కాకుండా సాధారణ ప్రేక్షకులు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు కానీ టీజర్ ను మరోసారి చూస్తే వెంటనే అర్థం అవుతుంది. టీజర్ లో 34 సెకెన్లకు ఒక పావురం కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు చాలామంది నెటిజన్లు ‘శాంతి.. స్వతంత్రం’ అంటూ బదులిచ్చారు. ఒకరేమో ‘విలన్ వల్ల శాంతి లేక ఎగిరిపోయింది’ అన్నారు. సరైన జవాబు ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది కానీ కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. టీజర్ వ్యూస్ పెంచేందుకు ఈ ప్రమోషన్ కాన్సెప్ట్ ఇతర సినిమాల వారు కూడా త్వరలో అందిపుచ్చుకోవడం ఖాయం.
Please Read Disclaimer