బాసూ లేడీ బాసూ గెట్ టుగదర్ లా ఉంది!

0

ఇది ప్రీరిలీజా.. గెట్ టుగదర్ పార్టీనా? .. `సరిలేరు..` ఈవెంట్ పై నెటిజనుల కామెంట్ల తీరు ఇది. ఒక రకంగా ఇది ప్రీరిలీజ్ వేడుక అనే కంటే బాసూ లేడీ బాసూ గెట్ టుగదర్ పార్టీలా ఉంది అంటూ వేడెక్కే కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టే బాస్ చిరంజీవి.. లేడీ బాస్ విజయశాంతి ఓచోట చేరి ముచ్చట్లలో మైమరిచిపోవడం .. స్వీట్ మెమరీస్ లోకి వెళ్లి ఇహలోకాన్ని మర్చిపోవడం స్పష్టంగా వేదిక వద్ద కనిపించింది.

ఇక చిరంజీవి- విజయశాంతి క్రేజీ కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి. నాటి రోజుల్లో బాసూ లేడీ బాసూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందుకే ఆ ఇద్దరూ ఇలా ఒకే వేదిక వద్ద అలా చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడేసుకోవడం అభిమానుల్లో కల్లోలానికి కారణమైంది. మెగాస్టార్ చిరంజీవి- లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటను ఒకే ఫ్రేమ్ లో బంధించేందుకు టాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. చాలా గ్యాప్ తర్వాత క్రేజీ కాంబినేషన్ ను అలా వేదికపై చూసేసరికి ఎమోషన్ అయి పోయారు సీనియర్ ఫోటోగ్రాఫర్లు. ఫ్రేమ్ లో మహేష్ ఉన్నా.. తనని డామినేట్ చేస్తూ బాసూ- లేడీ బాసూ ఫోటోలు దిగిపోవడం పైనా ఆసక్తికర ముచ్చటా వేదిక వద్ద వేడెక్కించింది.

ఆ ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు లేక పోయినా రాజకీయాల పరంగా ఫ్యాన్స్ లో చిన్నపాటి డిస్కషన్ నడిచేది. ఆ ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్న ప్రచారం అభిమానుల్లో సాగింది. కానీ అవన్నీ మర్చిపోయి ఇలా వేదికపై కలవగానే బాస్ తన లేడీ హీరోయిన్ ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో.. ఇక బాస్ ని చూడగానే మైమరిచిన లేడీ బాస్ ఎంత ఎగ్జయిటై పోయారో ప్రత్యక్షం గా అక్కడ కనిపించింది. చూపరులు అసలు ఆ జోడీ పైనుంచి కళ్లు తిప్పుకో లేకపోయారంటే నమ్మండి. ప్రస్తుతం ఆ ఇద్దరి యవ్వారం పైనా సోషల్ మీడియాల్లో జోకులు మీమ్స్ హంగామా మామూలు గా లేదు. ఒక నెటిజనుడు ఇదే విషయాన్ని సూటిగానే అడిగేశాడు.

“ఇది ప్రీరిలీజ్ ఈవెంట్ లా లేదు. చిరు – విజయశాంతి గెట్ టుగదర్ లా ఉంది“ అంటూ సూటిగానే అన్నాడు సుత్తి లేకుండా. అసలు ఆ ఇద్దరూ మహేష్ ఈవెంట్ కి వచ్చినట్టు లేదు.. వీళ్లు పార్టీ చేసుకుంటే మహేష్ వచ్చి వెళ్లినట్టుంది! అంటూ టీవీక్షకులు ఫీలయ్యారు మరి. అంతా బాగానే ఉంది కానీ చిరు ఛాన్సిస్తే ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధమేనని సూచన ప్రాయంగా విజయశాంతి అంగీకరించారు. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన ఫీలర్స్ వదిలారు. అయితే చిరు తనకు ఛాన్సిచ్చారా లేదా? కొరటాల తెరకెక్కించే సినిమాలో విజయశాంతి నటిస్తున్నారా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer