‘సరిలేరు నీకెవ్వరు’ ప్రోగ్రాం లైవ్.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు

0

మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. వాహనాల్ని ఆ మార్గంలో వెళ్లకుండా డైవర్ట్ చేయనున్నారు. ఆదివారం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఈ ఆంక్షల్ని అమలు చేయనున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆదేశాల ప్రకారం అబిడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాల్ని గన్ ఫ్రౌండీ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి బషీర్ బాగ్ వైపు వెళ్లే వాహనాల్ని హిమాయత్ నగర్ వైపు పంపుతారు. కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాల్ని ఈడెన్ గార్డెన్ వైపు పంపుతారు. లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాల్ని హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు.

ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి వచ్చే వాహనాల్ని నాంపల్లి వైపు మళ్లిస్తారు. రవీంద్రభారతి వైపు నుంచి వచ్చే వాహనాల్ని నాంపల్లి వైపు పంపుతారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తే మంచిది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం వాహనదారులకు తిప్పలు తప్పవని చెప్పక తప్పదు.
Please Read Disclaimer