సరిలేరు.. రిలీజ్ కు ముందే రికార్డ్

0

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే అన్ లైన్ బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. చివరి నిమిషం వరకూ చిత్రబృందం ప్రచారం చేస్తూ ఫ్యాన్స్ కి చేరువవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఔట్ పుట్ పై మహేష్ -అనీల్ రావిపూడి బృందం పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు సహా.. ఓవర్సీస్ లో ఈ సినిమా పెద్ద ఎత్తున రిలీజవుతోంది.

అయితే కేరళలో మహేష్ క్రేజ్ మార్కెట్ వర్గాలకే బిగ్ షాక్ ఇస్తోంది. అక్కడ రిలీజ్ కు ముందే సరిలేరు ఓ కొత్త రికార్డు సొంతం చేసుకుంది. దేవ దూతల రాష్ట్రం గా చెప్పుకునే మలబారు ప్రాంతం లో మహేష్ సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవలం కేరళ లోనే దాదాపు 30 సెంటర్లలలో ఓ తెలుగు సినిమా రిలీజవ్వడం అన్నది రేర్. కానీ సరిలేరు తో అది సాధ్యమైంది. ఈ సినిమాలో డైలాగ్ మాదిరిగానే.. `నెవ్వెర్ బిఫోర్ ..ఎవ్వర్ ఆప్టర్` అన్నట్లే రిలీజవుతోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా కానీ….ఏ స్టార్ హీరో సినిమా కానీ ఇన్ని సెంటర్లలో రిలీజ్ కాలేదు.

కేరళ మార్కెట్లో మెగాస్టార్ చిరంజీవి- అల్లు అర్జున్- రామ్ చరణ్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక బన్ని క్రేజు యూత్ లో ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. అయితే మెగా కాంపౌండ్ హీరోల్ని మించి ఇప్పుడు మహేష్ కాంపౌండ్ ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్ రిలీజ్ కు ముందే అరుదైన రికార్డు అందుకున్నారు. `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అక్కడ రిలీజ్ అవుతోంది. శనివారం ఉదయం 6.30 గంటలకు మొదటి షో థియేటర్ లో పడనుంది. అయితే దేవదూతల ఇలా తలంలో మహేష్ హంగామా ఎలా ఉంటుంది? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు థియేటర్లు ఇప్పటికే ముస్తాబై సిద్దంగా ఉన్నాయి. మహేష్ అభిమానుల్లో ఇంకొన్ని గంటల్లోనే సంక్రాంతి సంబరాలు మొదలు కాబోతున్నాయి.
Please Read Disclaimer