మూడవ సారి కూడా తగ్గని మహేష్ జోరు

0

ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా ఒకటి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో నిలిచిన ఈ సినిమా వసూళ్ల విషయంలోనే కాకుండా పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను భారీ మొత్తానికి జెమిని టీవీ హక్కులు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మూడు సార్లు జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ఈ మూడు సార్లు కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంది. సాదారణం అయితే ఒకటి రెండు సార్లు మంచి రేటింగ్ ను దక్కించుకోవడం కామన్. కాని ఈ సినిమా మూడవ సారి కూడా మంచి రేటింగ్ దక్కించుకుని రికార్డు సృష్టించింది.

మూడవ సారి ప్రసారం అయ్యి అత్యధిక రేటింగ్ దక్కించుకున్న సినిమాగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. గత వారం జెమిని టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా ఏకంగా 12.55 రేటింగ్ సాధించింది. ఈ స్థాయి రేటింగ్ దక్కించుకోవడం చాలా గొప్ప విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా మూడవ సారి టీవీలో ప్రసారం అయ్యి ఈ స్థాయిలో రేటింగ్ దక్కించుకోవడం ఇదే మొదటి సారి. దీంతో మరోసారి తన స్టామినాను మహేష్ బాబు చూపించాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీలక పాత్రను విజయశాంతి చేసింది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా బుల్లి తెరపై రికార్డుల మోత మోగిస్తుంది. ముందు ముందు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా మంచి రేటింగ్ వస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.