సరిలేరు ట్రైలర్ రిలీజ్ తేదీ?

0

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ శర వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ చిత్రీ కరణ పూర్తయింది. రిలీజ్ కు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయమే ఉంది. దీంతో సైమ ల్టేనియస్ గా నిర్మాణానంతర పనుల్ని స్పీడప్ చేస్తున్నారని తెలుస్తోంది. అనీల్ రావిపూడి బృందం ఇప్పటి వరకూ ఎక్కడా బ్రేకులు లేకుండా షూటింగ్ చేశారు. మహేష్- విజయశాంతి జోడీ పై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్న ఫోటోలు ఇటీవల అంతర్జాలం లో లీకవ్వడం టీమ్ ని కలవరపరిచింది.

అయితే అదంతా ప్రచారానికి కలిసొస్తున్నా.. అసలు ఈ సినిమా పబ్లిసిటీ స్టంట్ పై మహేష్ ఫ్యాన్స్ అంత సంతృప్తి గా లేరని సోషల్ మీడియా లో ప్రచారం అవుతోంది. ఓ వైపు బన్ని సామ జవరగమన లాంటి చార్ట్ బస్టర్ల తో దూసుకు పోతుంటే.. ఇంత వరకూ సరిలేరు నుంచి సరైన పాట అయినా రాలేదన్న ఆందోళన నెలకొంది. అయితే ఈ లోగానే సరిలేరులో మ్యూజిక్ పరంగా స్టఫ్ ఏ మాత్రం తగ్గకుండా అనీల్ రావిపూడి ఎంతో జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. ఇందు లో ఒకటి కాదు రెండు పెప్సీ స్పెషల్ నంబర్స్ ఉండేలా అతడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ మేరకు దేవీ పై ఒత్తడి పెంచుతున్నాడని ఇది వరకూ రివీల్ చేశాం.

తాజా సమాచారం ప్రకారం.. మహేష్ అభిమానుల్ని ఖుషీ చేసే ట్రైలర్ ట్రీట్ కోసం అనీల్ రావిపూడి ఇప్పటి నుంచే ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారట. అయితే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అంటే.. కొత్త సంవత్సరం కానుక గా జనవరి 1న ట్రైలర్ ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. డిసెంబర్ 31 మిడ్ నైట్ 12 తర్వాత రిలీజ్ చేయనున్నారట. ఆ సమయం లో ట్రైలర్.. టీజర్లు.. పోస్టర్లు రిలీజవ్వడం అన్నది ప్రతియేటా చూస్తున్నదే. సరిగ్గా ఈ సారి అలాంటి ఒక మంచి అకేషన్ చూసి మరీ హైప్ పెంచాలన్నది అనీల్ రావిపూడి- దిల్ రాజు – అనీల్ సుంకర బృందం ప్లాన్ అని తెలుస్తోంది.

1 జనవరి సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. సరిగ్గా రిలీజ్ కి 10 రోజుల ముందు ట్రైలర్ రావడం కలిసొస్తుందని భావిస్తున్నారట. వాస్త వానికి నెల రోజుల ముందే పెద్ద సినిమాల ట్రైలర్ రిలీజ్ చేయడం అన్న సాంప్రదాయం ఉంది. ప్రీరిలీజ్ లేదా ఆడియో లో ట్రైలర్ వదిలేస్తారు. కానీ మహేష్ టీమ్ ప్లాన్ చూస్తుంటే డిఫరెంటు గానే కనిపిస్తోంది. ఒక రకంగా ట్రైలర్ రాక ఆలస్యం అవుతుందనే అర్థమవుతోంది. అయితే ఎందుకీ ఆలస్యం? అంటే .. కాస్త లేట్ అయినా లేటెస్టుగా రావాలన్న ఆలోచనేనట. మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇవ్వడమే ధ్యేయం గా ఇలా ప్లాన్ చేస్తున్నారట. కాస్త టైమ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ట్రైలర్ ని కట్ చేయాలన్న ప్లానింగ్ చేశారట. మహేష్ కథా నాయకుడి గా రష్మిక కథా నాయిక గా నటిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Please Read Disclaimer