సెన్సార్ పోస్టర్ లో రిలీజ్ డేట్ వేయలేదంటే అర్థమేంది భయ్యా?

0

సంక్రాంతి వస్తుందంటే చాలు అగ్ర హీరోల చిత్రాలు విడుదలకు పోటీ పడతాయి. ఈ ఏడాది అలా పోటీకి దిగిన సంక్రాంతి పుంజులు మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఒకటైతే.. బన్నీ నటించిన అల వైకుంఠపురములో మరొకటి. ఈ రెండు చిత్రాలు తొలుత జనవరి 11న రిలీజ్ అనుకున్నా.. తర్వాత కూచ్చొని చర్చలు జరిపిన తర్వాత.. ఒక మాట మీదకు వచ్చి డేట్లు మార్చుకోవటం తెలిసిందే. దీంతో సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందుగా విడుదలై థియేటర్ల లో సందడి చేస్తుందనుకున్నారు.

అంతా ఓకే అనుకున్న వేళలో.. థియేటర్లలో బొమ్మ వేసే విషయం లో వచ్చిన లెక్క తేడాలు.. చివరకు సినిమా విడుదల విషయంలో కొత్త ఎత్తులకు తెర తీశాయంటున్నారు. తొలుత అనుకున్న దానికి భిన్నంగా అల వైకుంఠపురమును రెండు రోజులు ముందుకు తీసుకొచ్చి.. జనవరి పదిన విడుదల చేయాలన్న ప్లాన్ లో నిర్మాతలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ అంశం మీద అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగానే సరిలేరు నీకెవ్వరు చిత్రం సెన్సార్ పూర్తి అయ్యిందని.. యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. అంతేకాదు.. సరికొత్త పోస్టర్ ను బయటకు తీసుకొచ్చింది. అందులో తమకొచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి మహేశ్ బాబు యాక్షన్ సీన్ కు సంబంధించిన ఫోటోతో పోస్టర్ విడదల చేసింది.

సెన్సార్ సర్టిఫికేట్ తో వచ్చిన పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సినిమా విడుదలకు రెండు వారాల ముందు నుంచి.. డేట్ ను అదే పనిగా రిజిస్టర్ చేస్తుంటారు. దీనికి భిన్నంగా రిలీజ్ కు మరో పది రోజుల కంటే తక్కువ టైం ఉన్న వేళ విడుదల చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవటం చూస్తే.. కొత్త ప్లానింగ్ లో సరిలేరు నీకెవ్వరూ టీం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ మారుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. వారి నిర్ణయానికి తగ్గట్లు తమ నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలుగా డేట్ ను అనౌన్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అల వైకుంఠపురం రిలీజ్ డేట్ మారితే.. సరిలేరు బయ్యర్ల నుంచి ఒత్తిడి రావటం ఖాయమని.. అందుకే ముందు జాగ్రత్త లో భాగంగా రిలీజ్ డేట్ ను సెన్సార్ తర్వాత విడుదల చేసిన పోస్టర్ లో వేయలేదన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి రెండు అగ్ర హీరోల చిత్రాల రిలీజ్ డేట్ల మీద ఉన్న కన్ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో కానీ.. అభిమానులకు మాత్రం ఇప్పుడీ వ్యవహారం కలవరంగా మారిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer