సరిలేరు నీకెవ్వరు సెన్సార్ రివ్యూ

0

సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్రధారి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర- దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతోంది. భరత్ అనే నేను- మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత మహేష్ నటించిన సినిమాగా ఎంతో క్రేజీగా రిలీజ్ కి వస్తుండడంతో అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ హ్యాట్రిక్ రేసులో ఉన్నాడన్న ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది.

తాజాగా సెన్సార్ రిపోర్ట్ అందింది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కుటుంబ సభ్యులు నిరభ్యంతరంగా సినిమా చూడొచ్చన్నమాట. ఇది అనీల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ సెంటిమెంట్స్ రొమాన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ రక్తి కట్టించనున్నాయి. ఇటీవలే రిలీజైన ట్రైలర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఇందులో ఎఫ్ 2 తరహా ఫన్ కి కొదవేమీ లేదని ట్రైలర్ చెబుతోంది.

సరిలేరు .. నిడివి కూడా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 169 నిమిషాల నిడివితో ఈ చిత్రం రిలీజవుతోంది. అంటే మూడు గంటల సినిమానే ఇది. జస్ట్ 11 నిమిషాలు తక్కువ అంతే. ఈ చిత్రం కూడా ఇతర చిత్రాల్లానే తెలుగు వెర్షన్ కొన్ని చోట్ల ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ కానుంది.
Please Read Disclaimer