సరిలేరు నీకెవ్వరు… 4 రోజులు నెం.1

0

సూపర్ స్టార్ మహేష్ బాబు యూట్యూబ్ లో మరో రికార్డును నమోదు చేశాడు. తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం టీజర్ తో సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఏ స్టార్ హీరో టీజర్ లేదా ట్రైలర్ విడుదలైనా కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం చాలా కామన్. మొదటి రోజు లేదంటే రెండవ రోజు వరకు యూట్యూబ్ లో నెం.1 గా ట్రెండ్ అవుతూ ఉంటుంది. కాని ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మాత్రం ఏకంగా నాలుగు రోజులుగా నెం.1 గా ట్రెండ్ అవుతూనే ఉంది.

తక్కువ టైంలోనే 20 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఎక్కువ సమయం యూట్యూబ్ లో నెం.1 గా ట్రెండ్ అయినా.. ఇంకా అవుతూనే ఉన్న టీజర్ గా సరిలేరు నీకెవ్వరు టీజర్ నిలిచింది. ఈ టీజర్ యూట్యూబ్ లో ఇంకా కూడా ట్రెండ్ అవుతుంది అంటే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయశాంతి కీలక పాత్రలో నటించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా మహేష్ కు జోడీగా చేసింది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో బండ్ల గణేష్ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి చాలా ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer