ట్రెండింగ్: సరిలేరు నీకెవ్వరు కథ లీక్

0

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఆసక్తికర సన్నివేశాలుంటాయని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. అలాగే మహేష్ ఆర్మీ మేజర్ లుక్ లో అదిరి పోయాడు. ఇంతవరకూ బాగానే ఉంది. మరి సరిలేరు కథాంశం ఏమిటి? ఇందులో ఆర్మీ నేపథ్యం ఎంత సేపు ఉంటుంది? కమర్షియల్ అంశాల కోసం అనీల్ తీసుకు లిబర్టీస్ ఏమిటి? అంటే ఆసక్తిర విషయాలు తెలిసాయి. దీంతో పాటు సినిమా స్టోరీ కూడా బయట కు వచ్చింది.

నేరుగా దర్శకుడు అనీల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కథ లీక్ చేసేసారు. ఇందులో మహేష్ ముందుగా ఆర్మీ ఆఫీసర్ లో కనిపించనున్నాడు. అనంతరం బోర్డర్ నుంచి సభ్య సమాజంలోకి వస్తాడుట. అక్కడ అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఆ సైనికుడు ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే కథాంశం. అంటే ఈ కథలోకి కమర్షియల్ అంశాల్ని జొప్పించేందుకు కర్నూల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడట. ఆర్మీ మేజర్ ఒక మామూలు సమాజంలోకి వచ్చిన తర్వాత కమర్శియల్ హంగులతో కథను చెప్పాడన్నమాట. ఇందులో అనీల్ మార్క్ పంచ్ డైలాగులు..ప్రాసలు మెప్పిస్తాయట. తన గత సినిమాల ప్లేవర్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది.

అలాగే విజయశాంతి పాత్రను మాత్రం అనీల్ రివీల్ చేయలేదు. ఆ పాత్ర సస్పెన్స్ అంటూ స్కిప్ చేసాడు. అయితే ఆ రెండు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. ఈ సినిమాతో హిట్ ఇచ్చి మహేష్ కళ్లలో ఆనందం చూడటమే తన లక్ష్యం అని అనీల్ అన్నాడు. ఎఫ్-2 షూటింగ్ సమయం లో ఈ కథను మహేష్ కి వినిపంచాడుట. మహేష్ ఒకే చెప్పగానే ప్రాజెక్ట్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు తెలిపాడు.
Please Read Disclaimer